BJP whip issued to Rajya Sabha MPs: న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీ (BJP) కీలక నిర్ణయం తీసుకుంది. 14వ తేదీన తప్పనిసరిగా సభకు హాజరుకావాలని పేర్కొంటూ.. బీజేపీ తమ పార్టీకు చెందిన రాజ్యసభ సభ్యులకు బుధవారం మూడులైన్ల విప్ జారీ చేసింది. ఈనెల 14 నుంచి అక్టోబరు 1వ తేదీవరకు ఎలాంటి సెలవులు లేకుండా నిరంతరాయంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ( Parliament Monsoon Session ) జరగనున్న విషయం తెలిసిందే. అయితే సమావేశం ప్రారంభమయ్యే మొదటి రోజునే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ (Deputy Chairman of the Rajya Sabha) పదవికి ఎన్నిక జరుగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ తమ సభ్యులకు విప్ జారీ చేసింది. ఎన్డీయే అభ్యర్థిగా జేడీయూకు చెందిన ఎంపీ హరివంశ్ నామినేషన్ బరిలో ఉన్నారు. Also read: Parliament session: ప్రశ్నోత్తరాలు లేకుండానే పార్లమెంట్
అయితే ఈ పదవికి నామినేషన్ గడువు 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటలతో ముగియనుంది. ఈ క్రమంలో ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌కు మద్దతు కూడగట్టే బీజేపీ ఇప్పటికే సంప్రదింపులు జరుపుతోంది. హరివంశ్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కరోనా వ్యాప్తి మేరకు లోక్‌సభ, రాజ్యసభ చెరో నాలుగు గంటలపాటు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. Also read: Parliament Monsoon Session: 14 నుంచే పార్లమెంట్