బాలీవుడ్ హీరోయిన్గా మరియు ఒకప్పుడు పోర్న్ స్టార్‌గా ఘనతకెక్కిన సన్ని లియోన్ పై పలువురు కన్నడిగులు మండిపడ్డారు. కర్ణాటక రక్షణ వేదిక యువసేన ఆధ్వర్యంలో రోడ్డు మీద బైఠాయించి కర్ణాటక రాష్ట్రంలో సన్ని లియోన్ అడుగుపెట్టకూడదని డిమాండ్ చేశారు. ఓ సంస్థ త్వరలో బెంగళూరులో జరగబోయే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సన్ని లియోన్‌తో ప్రదర్శనను ఏర్పాటు చేయాలని భావించడమే ఈ వివాదానికి కారణమైంది.
బెంగళూరులోని వైట్ ఆర్చిడ్ హోటల్లో "సన్ని నైట్ ఇన్ బెంగళూరు న్యూ ఇయర్ ఈవెంట్ 2018' పేరుతో త్వరలో ఒక కార్యక్రమాన్ని బెంగళూరులో నిర్వహించనున్నారు. అయితే కన్నడ సంప్రదాయ, సంస్కృతిని కాలరాసే విధంగా ఈ ఈవెంట్ ఉందని.. ఒక పోర్న్ స్టార్‌ని కన్నడ రాష్ట్రానికి తీసుకురావడానికి నిర్వాహకులకు ఎంత ధైర్యమని చెబుతూ కర్ణాటక రక్షణ వేదిక యువసేన ధర్నాకి దిగడం గమనార్హం.
Karnataka: The members of pro- Kannada group Karnataka Rakshana Vedike Yuva Sene staged a demonstration protesting against actor Sunny Leone taking part in a new year eve event at Manyata Tech Park in Bengaluru pic.twitter.com/fwk7PetVP9
— ANI (@ANI) December 15, 2017