ప్రజల భద్రత, వ్యక్తిగత స్వేచ్ఛ దృష్ట్యా చైనా యాప్ టిక్‌టాక్‌పై నిషేధం విధించాలన్న డిమాండ్ అమెరికాలో పెరుగుతోంది. ఈ మేరకు 25 మంది కాంగ్రెస్ సభ్యులు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు విజ్ఞప్తి చేయడం గమనార్హం.
దేశభధ్రతను పరిగణలో తీసుకుని ఇండియా ఇప్పటికే చైనా దేశానికి చెందిన టిక్‌టాక్ సహా 59 యాప్‌లపై నిషేధం విధించింది. ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం అన్ని దేశాల్లో చర్చనీయాంశమైంది. ఇతర దేశాల్లో కూడా టిక్‌టాక్‌ను నిషేధించాలన్న డిమాండ్ పెరగసాగింది. అమెరికా కూడా ఈ దిశగా ఆలోచన చేసింది. అటు అమెరికన్లు కూడా టిక్‌టాక్‌ను నిషేధించాలని కోరారు. తాజాగా యూఎస్ కాంగ్రెస్ సభ్యులు 25 మంది అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్‌కు ఓ లేఖ రాశారు. దేశ ప్రజల భద్రత, వ్యక్తిగత స్వేచ్ఛను పరిగణలో తీసుకుని టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా ఇండియా తీసుకున్న నిర్ణయం గురించి ప్రస్తావించారు. ప్రజల సమాచారాన్ని టిక్‌టాక్ యాప్ ద్వారా చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి చేరుతోందన్నది ప్రధాన అభియోగం. Also read: Infosys: లాభాల్లో ఇన్ఫోసిస్, 12 శాతం వృద్ధి
టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్ చైనా ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటోందని..సమాచారాన్ని బదిలీ చేస్తోందని అస్ట్రేలియన్ సంస్థ ఇటీవల ధృవీకరించింది. ఈ నేపధ్యంలో టిక్ టాక్ సహా చైనా దేశపు యాప్ లపై నిషేధం విధిస్తే తాము సహకరిస్తామని యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ట్రంప్‌కు విన్నవించారు. Also read: Skill India: నైపుణ్యమే ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది: ప్రధాని మోదీ