రాహుల్ ద్రావిడ్ .. భారత క్రికెట్ ఫ్యాన్స్ ( Indian Cricket Fans ) కు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. అభిమానులు అతన్ని ముద్దుగా ‘ది వాల్’ ( The Wall ) అని, “మిస్టర్ డిపెండబుల్” ( Mister Dependable ) అని పిలుచుకుంటారు. అయితే రాహుల్ ద్రావిడ్ బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లో, వికెట్ కీపింగ్ లో అన్నింటా మిస్టర్ డిపెండబుల్ క్రికెటర్ అని నిరూపించుకున్నాడు. Also Read : Chinese apps banned: చైనా యాప్స్ నిషేధం.. స్పందించిన చైనా సర్కార్
Outstanding catcher Rahul Dravid 👌👌 pic.twitter.com/DnLQhKlHPV
— Harbhajan Turbanator (@harbhajan_singh) June 30, 2020
అయితే క్యాచుల విషయంలో రాహుల్ ద్రావిడ్ ట్రాక్ రికార్డు అద్భుతం. మొత్తం 344 వన్డేలు ఆడిన ద్రావిడ్ 124 క్యాచులు పట్టాడు. అదే టెస్టుల్లో మొత్తం 160 మ్యాచుల్లో 210 క్యాచులు పట్టి అత్యధికంగా క్యాచులు పట్టిన ప్లేయర్‌గా రికార్డు సొంతం చేసుకున్నాడు ద్రావిడ్.. Also Read : అమెజాన్ పే, పేటీఎంకు దీటుగా మరో యాప్..
అయితే బౌలింగ్ ఎండ్ లో అనిల్ కుంబ్లే ( Anil Kumble ) ఉన్నప్పుడు బ్యాట్స్ మెన్ మాత్రమే కాదు… వికెట్ కీపర్, స్లిప్ లో ఉన్న ఫీల్డర్‌కు కూడా కాస్త టెన్షన్‌గా ఉంటుంది. ఎందుకంటే బాల్ అంతలా టర్న్ అవుతుంది. ఎటువైపు వెళ్తుందో ఊహించడం కష్టం. అలాంటి క్యాచులను కూడా రాహుల్ ద్రావిడ్ అద్భుతంగా డైవ్ చేసి ఒడిసి పట్టుకునేవాడు. ఈ వీడియోలో మీరు అలాంటి 27 అద్భుతమైన క్యాచ్ లు చూడవచ్చు.