న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయరీ దిగ్గజం బీఎండబ్ల్యూ భారత సీఈవో రుద్రతేజ్ సింగ్ మరణించారు. అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు. జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ సంస్థ భారత్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఇక్కడ సీఈవోగా నియమించారు. 2019 ఆగస్టు1న రుద్రతేజ్ సింగ్ సీఈవోగా నియమితులయ్యారు. Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!
ఆయనను సాధారణంగా రుడీ అని పిలుస్తారని తెలిసిందే. బీఎండబ్ల్యూ భారత కార్యక్రమాలు చూసేందుకు ఎంపికైన తొలి భారతీయుడు రుద్రతేజ్ సింగ్ కావడం గమనార్హం. 25ఏళ్ల కెరీర్లో ఆయన ఆటో మేటివ్, నాన్ ఆటోమేటివ్ సంస్థలలో కీలక పదవులు నిర్వహించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఏపీలో దారుణం: లాఠీ దెబ్బలకు యువకుడి మృతి!
హిందూస్తాన్ యూనిలివర్ కంపెనీకి భారత్లో, అంతర్జాతీయ మార్కెట్లలోనూ 16ఏళ్ల పాటు సుదీర్ఘంగా సేవలు అందించారు. చివరగా రాయల్ ఎన్ఫీల్డ్ గ్లోబల్ ప్రెసిడెంట్గా విశేషంగా రాణించారు. గత 8నెలలుగా బీఎండబ్ల్యూ భారత ప్రెసిడెంట్గా, సీఈవోగా రుద్రతేజ్ సింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఆకస్మిక మరణం పట్ల వ్యాపార ప్రముఖులుల సంతాపం ప్రకటిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..