Private Employess: ప్రైవేటు ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే న్యూస్..! మినిమం శాలరీతో పాటు ఈపీఎఫ్ సహా పెన్షన్ భారీగా పెంపు..

Private Employess: కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ పేయి కమిషన్ నియమించింది. దాంతో ప్రతి యేడాది డీఏ, టీఏ, ఎల్టీసీ వంటి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. అదే సమయంలో ప్రైవేటు సెక్టార్ ఉద్యోగులకు మినిమం శాలరీతో పాటు ఉద్యోగ భద్రత సంబంధించిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.

1 /6

Private Employess: ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదించిన EPFO ​​జీతం పరిమితిని రూ.21,000కి పెంచడం అనేది ఉద్యోగుల సామాజిక భద్రతను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఒక కీలక అడుగు అని చెప్పాలి. EPF ఉన్న ఉద్యోగోగులకు జీవతాన్ని సరళీకృతం చేయడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అనేక ముఖ్యమైన మార్పులను చేస్తోంది.

2 /6

EPFO ​​సంస్కరణలలో భాగంగా, భారత ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) జీత పరిమితిని పెంచబోతుంది. ఇది జరిగితే, దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు,  కంపెనీలపై ఇది పెను  ప్రభావాన్ని చూపుతుంది. ఉద్యోగుల భవిష్య నిధి (EPF) అనేది పదవీ విరమణ తర్వాత కార్మికులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించే  ఒక ప్రధాన సామాజిక భద్రతా పథకం.

3 /6

ఈపీఎఫ్ పథకంలో చేరుతున్న ఉద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆర్థిక భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా వేతన పరిమితి పెంపు కోసం ఈ డిమాండ్ కొంతకాలంగా ఉంది. ప్రస్తుతం ప్రతిపాదించిన విధంగా EPFO ​​జీతం పరిమితిని రూ.21,000కి పెంచడం అనేది ఉద్యోగుల సామాజిక భద్రతను మెరుగుపరచడానికి ఉద్దేశించిన మంచి అడుగు అని చెప్పాలి. ఇది లక్షలాది మంది కార్మికులకు మెరుగైన పదవీ విరమణ తర్వాత  ఆర్ధికంగా భరోసా ఇచ్చేది ఈపీఎఫ్.

4 /6

ఈ జీతం పరిమితి పెంపు అంశం ఇంకా చర్చలో ఉంది. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటుందని ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు భావిస్తున్నారు.ప్రస్తుతం, నెలకు రూ. 15,000 వరకు జీతం పొందుతున్న ఉద్యోగులు మాత్రమే తప్పనిసరిగా EPF పరిధిలోకి వస్తున్నారు. ఈ పరిమితిని 2014 లో నిర్ణయించారు. అప్పటి నుండి, జీతాలు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయం నుండి ప్రతిదానిలోనూ గణనీయమైన మార్పులు వచ్చాయి.

5 /6

జీత పరిమితిని రూ.21,000కి పెంచడం ద్వారా, మరింత మంది ఉద్యోగులకు EPF ప్రయోజనాలు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

6 /6

ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తే, పెన్షన్ మొత్తం పెరుగుతుంది. దీనివల్ల ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత ఎక్కువ డబ్బు పొందేందుకు వీలు కలుగుతుంది. ఈ మార్పు ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) కింద ఉన్నవారికి పెన్షన్ చెల్లింపులను పెంచబోతుంది. రూ. 15,000 నుండి రూ. 21,000 మధ్య జీతం పొందుతున్న కార్మికులు ఇప్పుడు EPS ప్రయోజనాలను పొందుతున్నారు.  ఇది పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను కల్పిస్తోంది.