Daaku Maharaaj Number 1 Trending: థియేట్రికల్ గా మంచి విజయం అందుకున్న ‘డాగు మహారాజ్’ మూవీ ఈ నెల 21 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అంతేకాదు అక్కడ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చినప్పటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో మిగతా హిందీ చిత్రాలతో పాటు ఇంటర్నేషనల్ చిత్రాలను వెనక్కి నెట్టి నెంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. దీంతో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ‘డాకు మహారాజ్’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత విడుదలైన వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ధాటిని తట్టుకొని ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని హిట్ గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 90 కోట్ల షేర్ (రూ. 165 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఒక వేళ ‘డాకు మహారాజ్’ మూవీ సోలోగా రిలీజై ఉంటే మంచి వసూల్లే దక్కేవి. బాలయ్య విషయానికొస్తే.. రీసెంట్ గా హీరోగా 50 యేళ్ల పూర్తి చేసుకున్నారు. ఓ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ హీరోగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న హీరోగా నిలిచారు. అటు ఎమ్మెల్యేగా.. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్.. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో రక్తదానాలు చేస్తూ సమాజానికి తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో కేంద్రం నటుడిగా, సామాజిక సేవలకు గాను బాలయ్యను పద్మభూషణ్ తో గౌరవించింది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
త్వరలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా రాష్ట్రపతి భవన్ లో ఈ అవార్డు అందుకోనున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ తాండవం పేరుతో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం కుంభమేళాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం దసరా కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఈ సినిమా తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడు. అటు హరీష్ శంకర్ తో కూడా నెక్ట్స్ మూవీతో పాటు ఆదిత్య 999 మ్యాక్స్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. డాకు మహారాజ్ మూవీని నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ. 50 కోట్లు వెచ్చించి ఐదు భాషలకు చెందిన స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.