School Holidays: ఫిబ్రవరి 27న కూడా అన్నీ స్కూళ్లు బంద్.. శివరాత్రి మరుసటి రోజు ఎందుకు సెలవు తెలుసా..?

February 27th School Holiday: ఈ నెల 26న మహా శివరాత్రి పండను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు సనాతన హిందువులు. అన్ని పండగల్లో పిండి వంటలు, ఇతరత్రా వంటకాలుంటాయి. కానీ శివరాత్రి రోజున మాత్రం చాలా మంది ఉపవాసంతో పాటు రాత్రి మొత్తం జాగారం ఉంటారు. దీంతో నెక్ట్స్ డే కూడా భక్తులు అలసటతో ఉంటారు. దీంతో కొన్ని చోట్ల ప్రభుత్వాలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటిస్తూ ఉంటాయి.

1 /6

ఇక తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు మహా శివరాత్రి తర్వాతి రోజై ఈ నెల 27న సెలవు ప్రకటించాయి. అంతేకాదు ఆ రోజు సెలవును మార్చి రెండో శనివారం పని దినంగా పెట్టబోతున్నట్టు సమాచారం.

2 /6

మార్చి 27న ఐచ్ఛిక సెలవుగా ప్రకటించింది. అటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు మహా శివరాత్రితో పాటు ఆ తర్వాత రోజును కూడా సెలవు దినంగా ప్రకటించాయి.

3 /6

ప్రస్తుతం పరీక్షల సీజన్ కాబట్టి... కొన్ని ఇంపార్టెంట్ పరీక్షలను యథాతదంగా నిర్వహించడం లేదా అన్ని పరీక్షలు అయిపోయిన తర్వాత రోజు ఆయా పరీక్షను పెట్టడం చేయాలని పలు రాష్ట్రాలు విద్యాశాఖకు సూచించినట్టు సమాచారం.

4 /6

మొత్తంగా నిత్యం బిజీ బిజీ గా స్కూల్ హోం వర్క్స్ తో పాటు అసైన్ మెంట్స్ తో బిజీ ఉండే స్టూడెంట్స్ కు సెలవు దొరికిత కాస్తంత రిలాక్స్ అవుతారు. అటు పేరేంట్స్ కూడా నిత్యం పిల్లల చదవు, వాళ్లను స్కూళ్లకు, కాలేజీలకు దింపుతూ నిత్యం ఫుల్ బిజీగా గడుపుతారు. అలాంటి వారికి ఈ ఈ సెలవు అనేది పెద్ద రిలీఫ్ ఇస్తుంది.

5 /6

మొత్తంగా విద్యార్థులకు సెలవు అంటేనే పండగ. అలాంటిది మహా శివరాత్రి వంటి పెద్ద పండగ తర్వాత రోజు కూడా సెలవు దొరకడం వాళ్లకు కాస్తంత రిలీఫ్ ఇచ్చినట్టే. అటు ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్ధులకు ఒక రోజు సెలవు దొరకడం వలన మొత్తం సిలబస్ ను ఓ సారి చదువు చేసుకోవచ్చు.

6 /6

మొత్తంగా వీక్ మధ్యలో బుధ, గురువారాలు సెలవు రావడంతో రిలాక్స్ ఫీలవ్వచ్చు. ఈ సెలవు ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు మాత్రమే. ఇంట్లో ఎవరైనా సాప్ట్ వేర్ కానీ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు శుక్రవారం సెలవు పెడితే.. శని, ఆదివారాలతో కలిపి వరుసగా 5 రోజుల సెలవులు కలిసొచ్చే అవకాశాలున్నాయి.