Klin Kaara face revealed: సుమారుగా 10 ఏళ్ల తర్వాత మెగా హీరో రామ్ చరణ్, ఉపాసనకు క్లింకార జన్మించింది.. ఈ విషయం మెగా అభిమానులతో పాటుగా మెగా కుటుంబ సభ్యులకు కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. అయితే ఇప్పటివరకు క్లింకార జన్మించి ఏడాది పైనే అవుతున్నా...తన ఫేస్ ను మాత్రం రివీల్ చేయలేదు మెగా కుటుంబ సభ్యులు. ఈమె ఫేస్ రివిల్ చేయాలని మెగా అభిమానులు ఎన్నోసార్లు డిమాండ్ చేశారు. కానీ అక్కడక్కడ కొన్ని సందర్భాలలో మాత్రమే మెగా ప్రిన్సెస్ క్లింకార ఫేస్ కొంత మేరకు వైరల్ గా మారుతున్నది.
అయితే తన కూతురు ఫేస్ ఎప్పుడు రివీల్ చేస్తారంటూ బాలయ్య ఇటీవలే అన్‌స్టాపబుల్ షోలో అడగగా తనని నాన్న అని పిలిచినప్పుడు రివీల్ చేస్తానంటూ తెలిపారు రామ్ చరణ్.. అయితే ఇప్పుడు తాజాగా క్లింకారకి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్నది.
రామ్ చరణ్ తన కూతురిని ఎత్తుకొని నిలుచున్న సమయంలో కొంతమంది ఫోటోలు, వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇదిగో మెగా ప్రిన్సెస్ క్లింకార ఫోటోలు అంటూ అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు కూడా క్లింకార సూపర్, క్యూట్ అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ తెగ వైరల్ గా చేస్తున్నారు. కానీ అఫీషియల్ గా క్లింకార ఫోటోలు షేర్ చేస్తే చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో వైరల్ గా మారుతున్నది.
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా మిక్స్డ్ టాక్ ని సంపాదించుకుంది.. అందుకే తన తదుపరిచిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో చేస్తూ ఉన్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.