Bengaluru woman works on laptop while car driving video: సాధారణంగా పోలీసులు డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా రూల్స్ పాటించాలంటారు. సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకొవాలి. అదే విధంగా డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ లలో మాట్లాడటం, మద్యం సేవించడం వంటివి చేయోద్దని చెప్తుంటారు. ఏమాత్రం డ్రైవింగ్ కంట్రోల్ తప్పిన కూడా జరగరాని ఘోరాలు జరిగిపోతుంటాయి.
ఈ క్రమంలోపోలీసులుఎంతగా రూల్స్ చెప్పిన కొంత మంది మాత్రం పూర్తిగా అశ్రద్దగా ఉంటారు. ఈ క్రమంలో ఒక మహిళ ఏకంగా డ్రైవింగ్ చేస్తు ల్యాప్ టాప్ ఓపెన్ చేసి ఆఫీస్ వర్క్ చూసుకుంటుంది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
A woman working on a laptop while driving. Bengaluru Traffic Police issues a Challan#Bengaluru #WorkFromCar #viralvideo pic.twitter.com/75h5YGCTIm
— Viral News Vibes (@viralnewsvibes) February 13, 2025
బెంగళూరులో ఒక మహిళ డ్రైవింగ్ చేస్తు రాత్రి పూట తన ఇంటికి వెళ్తుంది. ఆమెకు ఏమంతా అర్జంట్ వర్క్ వచ్చిందో కానీ.. డ్రైవింగ్ చేస్తునే ల్యాప్ టాప్ ఓపెన్ చేసింది. కారు నడిపిస్తునే ల్యాప్ టాప్ చూసుకుంటుంది. ఆమె పక్కన ఉన్న వాహానంలో కొంత మంది ఆమె చేసిన పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇది కాస్త వైరల్ కావడంతో పోలీసుల వరకు వెళ్లింది. బెంగళూరు పోలీసులు దీనిపై రంగంలోకి దిగారు.
మహిళ అడ్రస్ ను ట్రేస్ చేసి.. ఆమెకు ట్రాఫిక్ రూల్స్ వయోలేట్ చేసినందుకు ఫైన్ విధించారు. ఈక్రమంలో మహిళ తాను.. ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నానని అర్జంట్ గా పని ఉండటం వల్ల లాగిన్ అయ్యానని చెప్పుకొచ్చింది. పోలీసులు.. మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి.. మరోసారి ఇలాంటి పనులు చేయోద్దని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఈఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Read more: Viral Video: మాఘీ పౌర్ణమి వేళ అద్భుతం.. శివలింగాన్ని ఆభరణంలా చుట్టుకున్న నాగు పాము.. వీడియో వైరల్..
దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంత డెంజరస్ మల్లీ టాస్కింగ్ పనులు అవసరమా.. అంటూ ఆమెను మండిపడుతున్నారు. రెప్పపాటులో ఏదైన ప్రమాదం జరిగితే ఎలా అంటూ ఆమె ప్రవర్తన సరికాదని కూడా కౌంటర్లు వేస్తున్నారు. మొత్తానికి సదరు మహిళ చేసిన పని ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter