Job Recruitment 2025: ఇంటర్ పూర్తైనవారికి రూ.49,623 జీతంతో ఉద్యోగాలు.. ఇదే మంచి ఛాన్స్‌.. ఇప్పుడే అప్లై చేసుకోండి!

Secretariat Assistant Job Recruitment 2025: ఎప్పటినుంచో మంచి శాలరీ తో జాబ్ పొందాలనుకుంటున్నారా.? ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్సాప్షన్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో కాళీ ఉన్న పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Secretariat Assistant Job Recruitment 2025: నిరుద్యోగ యువతకు అదిరిపోయే శుభవార్త.. సీఎస్ఐఆర్-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్ (సీడీఆర్ఎ) ప్రత్యేకమైన జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీ ఉన్న పోస్టులకు భర్తీ చేయబోతున్నట్లు వెల్లడించింది. ఈ పోస్టుల్లో భాగంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌తో పాటు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు. అయితే ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1 /6

ఈ రిక్రూట్మెంట్‌లో భాగంగా మొత్తం 11 పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ముఖ్యంగా CSIR-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్సాప్షన్ ఖాళీగా ఉన్న ఏడు సెక్రటరీ అసిస్టెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు నాలుగు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.   

2 /6

రిక్రూట్మెంట్‌ను కొత్తగా చేపట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఉద్యోగాల నోటిఫికేన్‌లో భాగంగా అభ్యర్థులకు సంబంధించిన అర్హతలను కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్హత గురించి క్లుప్తంగా పేర్కొన్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారు తప్పకుండా ఇంటర్ పూర్తి చేయాల్సి ఉంటుంది.   

3 /6

అలాగే ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన చివరి తేదీని కూడా వెల్లడించారు. అభ్యర్థులు మార్చి పదో తేదీలోపు ఈ ఉద్యోగాలను అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే జీతాల వివరాలను కూడా క్లుప్తంగా వివరించారు.   

4 /6

ఇక ఉద్యోగాలకు సంబంధించిన జీతాల వివరాల్లోకి వెళితే.. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థికి దాదాపు రూ.49,623 జీతం అందించబోతున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపారు. ఎక్స్పీరియన్స్‌ను బట్టి ప్రతి నెల రూ.81,100 భవిష్యత్తులో అందించే అవకాశాలు కూడా ఉన్నాయి.   

5 /6

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు తప్పకుండా కేటగిరీల వారిగా దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఓబిసి కి సంబంధించిన వారు తప్పకుండా ఈ పోస్టులకు అప్లై చేసుకునే క్రమంలో రూ.500 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు సంబంధించిన వారు ఎలాంటి ఫీజు చెల్లించనక్కర్లేదు..  

6 /6

అంతేకాకుండా ఈ నోటిఫికేషన్‌లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపికల వివరాలను కూడా వెల్లడించారు. ముందుగా ఉద్యోగాలు పొందాలనుకునేవారు రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కంప్యూటర్ టైపింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనన్నారు. ఈ ఉద్యోగాలను ఇప్పుడే అప్లై చేసుకునేవారు డైరెక్ట్‌గా https://cdri.res.in/ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.