Pistachio Benefits: మనిషి ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో సంపూర్ణంగా ఉంటాయి. ఏ పోషకాలు ఎందులో ఉంటాయో తెలుసుకుని సేవిస్తే అంతకంటే ప్రయోజనం మరొకటి ఉండదు. అలాంటిదే పిస్తా. ఆరోగ్యపరంగా అద్భుతమైంది. కేలరీలు, ప్రోటీన్లు, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ బి6, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి.
కంటి చూపు పిస్తాలో విటమిన్ ఎ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి చూపు మెరుగ్గా ఉండేలా చేస్తుంది.
బ్లడ్ షుగర్ లెవెల్ పిస్తా గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అందుకే డయాబెటిస్ రోగులకు చాలా లాభదాయకం.
చెడు కొలెస్ట్రాల్ పిస్తాలో పొటాషియం పెద్దమొత్తంలో ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గిస్తుంది.
ఎనర్జీ పిస్తాలో హై కేలరీలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి కావల్సిన ఎనర్జీ లభిస్తుంది.
బరువు నియంత్రణ బరువు తగ్గించే ఆలోచన ఉంటే పిస్తా రోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇందులో ఉండే ఫైబర్ బరువు నియంత్రణకు దోహదం చేస్తుంది