Pension Scheme: కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఉద్యోగులకు రూ.10 వేల పెన్షన్‌..


National Pension System Scheme: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పథకంలో భాగంగా పదవీ వివరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగాలు భారీ మొత్తంలో పెన్షన్‌ పొందవచ్చు. 10 ఏళ్లు పని చేసిన వారు దాదాపు రూ.10 వేల వరకు పెన్షన్‌ పొందవచ్చు.

National Pension System Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ప్రత్యేకమైన నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పథకం ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ ఈ పెన్షన్‌ పథకాన్ని ఏప్రిల్‌ 1వ తేది నుంచి అమలు చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే ప్రభుత్వ ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను పెంచేదుకు ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ పెన్షన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 /5

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పథకంలో భాగంగా 60 ఏళ్లు నిండిన వారు ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారనే భావనతో ఈ పెన్షన్‌ను అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంలో భాగంగా పాత పెన్షన్ పథకం (OPS)తో పాటు జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) రెండు ప్రయోజనాలను అందిస్తోంది.   

2 /5

ఈ పెన్షన్‌ పథకంలో భాగంగా ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత ఒక స్థిరమైన పెన్షన్ పొందుతారని కేంద్ర తెలిపింది. దీని వల్ల పదవీ విరమణ పొందిన తర్వాత కూడా ఎలాంటి సమస్యలు ఉండవు.. అలాగే ఈ పథకం ఆర్థిక భద్రతగా కూడా నిలుస్తుంది.  

3 /5

కేంద్రం అందిస్తున్న ఈ యుపిఎస్ పెన్షన్‌ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో కూడా 12 నెలల పాటు 50 శాతం వరకు జీతం పొందుతారు. అయితే ఈ పెన్షన్‌ అనేది ప్రభుత్వ సంస్థలో కనీసం 25 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు.  

4 /5

ఈ పెన్షన్‌ పథకం ప్రకారం.. ప్రభుత్వ రంగంలో 10 సంవత్సరాల పాటు పని చేసిన వారికి దాదాపు నెలకు రూ. 10,000 కనీస పెన్షన్‌ లభిస్తుంది. అంతేకాకుండా 25 సంవత్సరాల పని చేసిన వారు భారీ మొత్తం పెన్షన్‌ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.   

5 /5

అలాగే ఉద్యోగి మరిణిస్తే దాదాపు పెన్షన్‌లో 60 శాతం ఆతని కుటుంబానికి లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇవే కాకుండా ఈ పథకం ద్వారా బోలెడు బెనిఫిట్స్‌ లభిస్తాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికార వెబ్‌సైట్స్‌ను సందర్శించాల్సి ఉంటుంది.