Fermented Rice: ఇడ్లీ.. దోశ కంటే 100 రెట్లు బలం.. అమెరికాలో కాస్ట్లీ మనం తయారు చేసుకోవడం వెర్రీ ఈజీ..

Fermented Rice Recipe: మన శరీర ఆరోగ్యం బాగా ఉండాలి అంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు సరైన ఆహారం మన డైట్ లో చేర్చుకోవాలి. దీంతో ఏ ఆరోగ్య సమస్యలు మన దరిచేరకుండా ఉంటాయి.. అయితే కొన్ని రకాల ఆహారాల కూడా దూరంగా ఉంటూ మంచి లైఫ్ స్టైల్ నిర్వహించాలి. ఈరోజు మన బామ్మల కాలం నాటి బ్రేక్ ఫాస్ట్ రిసిపీని తెలుసుకుందాం.. దీంతో మీ గుండె వందేళ్లు బలంగా ఉంటుంది. 

Written by - Renuka Godugu | Last Updated : Feb 5, 2025, 04:15 PM IST
Fermented Rice: ఇడ్లీ.. దోశ కంటే 100 రెట్లు బలం.. అమెరికాలో కాస్ట్లీ మనం తయారు చేసుకోవడం వెర్రీ ఈజీ..

Fermented Rice Recipe: సాధారణంగా ఉదయం లేవగానే ఇడ్లీ లేదా దోశలు తింటూ ఉంటాం. మరికాస్త ఆరోగ్య స్పృహ ఉన్నవారు ఓట్స్‌, మిల్లెట్స్, పండ్లు వంటివి డైట్‌లో చేర్చుకోవాలి. అయితే మన బామ్మల కాలం నాటి పరిస్థితులు వేరే. ఆ కాలంలో ఉదయం లేవగానే చద్దన్నం తయారు చేసుకుని తీసుకునేవారు. అందుకే వారి ఆరోగ్యం కూడా బాగుండేది. వందేళ్లపాటు బతికేవారు. మన బామ్మల కాలం నాడు తయారు చేసుకున్న చద్దన్నం రిసిపీ ఇప్పటికీ ఎంతో ప్రాముఖ్యత కలిగింది. మనదేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఫెర్మెంటేడ్‌ రైస్‌ తీసుకుంటూ తీసుకునే ప్రాధాన్యత మరింత పెరిగింది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా కడుపులో యాసిడిటీ, గ్యాస్, మలబద్దకం సమస్య రాకుండా నివారిస్తుంది. ఉదయం కచ్చితంగా తీసుకోవాల్సిన రిసిపీ ఇది. 

మనదేశంలో ఈ తయారు చేసుకునే ప్రాముఖ్యత కలిగిన ఈ బామ్మల కాలం నాటి రిసిపీ ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అదే అమెరికాలో వంటి దేశాల్లో అయితే ఈ ఫెర్మెంటెడ్‌ రైస్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఈ ఆరోగ్యకరమైన ఆహారం ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. ఈరోజు మన బామ్మల కాలం నాటి చద్దన్నం రిసిపీని ఇంట్లోనే సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకుందాం. దీంతో ఇలాంటి ఆహారం డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎలాంటి మాత్రలు, ఆసుపత్రులకు మనం వెళ్లాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కడుపు ఆరోగ్యం బాగుంటుంది.

ఇదీ చదవండి:  ఈ నూనె జుట్టుకు తగిలితే చాలు.. ఒక్క వెంట్రుక వద్ద పది వెంట్రుకలు పెరుగుతాయి..

చద్దన్నం తయారు చేసుకునే విధానం..
బామ్మల కాలం నాటి చద్దన్నం తయారు చేసుకోవడానికి ముందు రాత్రి తయారు చేసుకొని పెట్టుకోవాలి. దీనికి మనం రాత్రి అన్నం మెత్తగా ఉడికించి వండుకోవాలి. ఈ రిసిపీని ఒక మట్టి పాత్రలో తయారు చేసుకోవడం వల్ల అద్భుత ప్రయోజనాలు పొందుతారు. తెల్ల అన్నం మెత్తగా ఉడికించుకొని అందులోనే కాస్త వేడి నీళ్లు కాస్త గోరువెచ్చని పాలు, ఒక నాలుగు టేబుల్ స్పూన్ల మజ్జిగ వేసి బాగా కలపాలి. ఇందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చద్దన్నంపై ఓ మూత పెట్టాలి. ఇది రాత్రంత పులియబెట్టినట్లు అవుతుంది. ఇదే ఆరోగ్యకరం. ఈ చద్దన్నం ఉదయం తినేటప్పుడు ఇందులో ఉప్పు రుచి కావాల్సినంత వేసుకొని తింటే సరిపోతుంది. ఆరోగ్యకరమైన రుచికరమైన చద్దనం రెడీ అయినట్టే. దీన్ని ప్రతిరోజు ఉదయం తీసుకోవడం వల్ల డయాబెటిస్ వారికి కూడా మంచిది. ఇక ఈ కాలంలో షుగర్ బీపీ సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటి వారు ఈ చద్దన్నం తీసుకోవడం వల్ల వారి ఆరోగ్యం నూరే నిండు నూరేళ్లు బాగుంటుంది.

ఇదీ చదవండి: భానుడి భగభగలు షురూ.. నేటి నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు..  

ఈ రిసిపీ మన బామ్మల కాలంనాటి బలవర్ధకమైన ఆహారం. ఎలాంటి ఖర్చు అదనంగా పెట్టాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే రైస్‌తో సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచితోపాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News