Telangana Caste Census: తెలంగాణలో కుల గణన చిచ్చురేపుతుండగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మరింత వివాదం రేపింది. కుల గణన నివేదికను రేవంత్ రెడ్డి వెల్లడించారు. కుల సర్వే-2024 నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 'దేశంలో బలహీనవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు సహేతుకమైన సమాచారం లేదు. దీంతో రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి ఉంది. 1931 తరువాత భారతదేశంలో ఇప్పటి వరకు బలహీన వర్గాల సంఖ్య ఎంతో తేల్చలేదు' అని విమర్శలు చేశారు.
Also Read: Revanth Reddy: దేశంలోనే తొలిసారి తెలంగాణలో కులగణన చేసి చరిత్ర సృష్టించాం
జనాభా లెక్కల్లోనూ బలహీనవర్గాల లెక్కలు పొందుపరచలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. 'భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ రాష్ట్రంలో కులగణన చేస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశాం. కుల గణన ప్రక్రియను పూర్తి చేసి ఇవాళ నివేదికను సభలో ప్రవేశపెట్టాం' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్వే వివరాలు వెల్లడిస్తూ.. 'ప్రతీ గ్రామంలో.. తండాల్లో ఎన్యుమరేటర్లు పకడ్బందీగా వివరాలు సేకరించాం. ప్రతీ 150 ఇండ్లను ఒక యూనిట్‌గా గుర్తించి ఎన్యూమరేటర్లను కేటాయించి వివరాలు సేకరించాం. 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు కష్టపడి ఈ నివేదికను రూపొందించారు. దీనికి రూ.160 కోట్లు ఖర్చుచేశాం' అని ప్రకటించారు. 'పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తరువాత సభలో ప్రవేశపెట్టాం. 56 శాతం ఉన్న బీసీలకు సముచిత గౌరవం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
Also Read: MLA Gunmen: దిగ్భ్రాంతికి గురిచేసే ఘటన.. ఎమ్మెల్యే గన్‌మెన్ ప్రాణం తీసిన 'అడవి పంది'
సర్వే వివరాలు
గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు.. పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వే చేశాం.
మొత్తంగా 1.12 కోట్ల కుటుంబాల వివరాలు సేకరణ
ఎస్సీలు: 61,84,319 (17.43 శాతం)
బీసీలు (ముస్లిం మైనార్టీ మినహా): 1,64,09,179 (46.79 శాతం)
ఎస్టీలు: 37,05,929 (10.45 శాతం)
ముస్లిం మైనార్టీలు: 44,57,012 (12.56 శాతం)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.