School Holiday: ఫిబ్రవరి 14న స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ఎందుకో తెలుసా?

February 14th School Holiday: విద్యార్థులకు సెలవు అంటేనే  ఎగిరి గంతేస్తారు. ఫిబ్రవరి 5న ఢిల్లీలోని స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. ఎన్నికల నేపథ్యంలో స్కూళ్లకు సెలవు రానుంది. అయితే, ఫిబ్రవరి 14వ తేదీ కూడా స్కూళ్లకు సెలవు ఉంది. ఎందుకో ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

విద్యార్థులుకు సంక్రాంతి సెలవులు భారీగానే వచ్చాయి. ఏవైనా పండుగలు, పవిత్ర దినాలు ఉంటే కూడా స్కూళ్లకు సెలవులు ఉంటాయి. కొన్ని జనరల్‌, మరికొన్ని ఆప్షనల్‌ హాలిడేస్‌ ఉంటాయి. అయితే, ప్రభుత్వం కొన్ని పండుగ దినాలను జనరల్‌ హాలిడేగా కూడా ప్రకటిస్తుంది.  

2 /5

జనవరి 28వ తేదీ 'షబ్‌ ఏ మేరాజ్‌' సందర్భంగా కొన్ని స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. ఈరోజు ముస్లింలు మసీదులను దీపాలతో అలంకరిస్తారు. జాగరణ కూడా చేస్తారు. ఆ సందర్భంగా మైనారిటీ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అయితే, మరోసారి విద్యార్థులకు సెలవు రానుంది.  

3 /5

ఫిబ్రవరి 14వ తేదీ ముస్లింలకు పవిత్రమైన రాత్రి. ఈరోజు 'షబ్‌ ఏ బరాత్‌' సందర్భంగా మరోసారి స్కూళ్లకు సెలవు రానుంది. మతపెద్దలు ఈ తేదీని ఖరారు చేశారు. అయితే, ప్రభుత్వం సాధారణ సెలవు కాకుండా ఆప్షనల్‌గా ప్రకటించింది.   

4 /5

దీంతో కొన్ని మైనారిటీ పాఠశాలలకు ఫిబ్రవరి 14వ తేదీన సెలవు పాటిస్తున్నారు. నెలవంక కనిపించడంతో ఆ రోజున షబ్‌ ఏ బరాత్‌ నిర్వహించాలని నిర్ణయించారు. మరికొన్ని పాఠశాలలు మరుసటి రోజు సెలవు పాటిస్తాయి.  

5 /5

మార్చి నెలలోనే ఇంటర్‌ ఎగ్జామ్స్‌ కూడా ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో సంక్రాంతి సెలవు దినాలు కూడా కుదిస్తారని ముందుగా ప్రచారం జరిగింది. కానీ, దాదాపు పది రోజులు ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లకు సెలవులు వచ్చాయి. ఇక ఫిబ్రవరి 5వ తేదీ ఢిల్లీ స్కూళ్లకు సెలవు. ఎన్నికల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు వచ్చాయి.