Aradhya petition in delhi high court: మాజీ విశ్వసుందరీ ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కఠినంగా చర్యలు తీసుకొవాలని ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో అసత్యమైన ప్రచారాలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ముఖ్యంగా సెలబ్రీటీల ప్రేమ, పెళ్లి, హెల్త్ కు సంబంధించిన అనేక అంశాలలో సత్యదూరమైన వార్తలను కొంత మంది కేటుగాళ్లు వైరల్ చేస్తున్నారు.
దీంతో సదరు వైరల్ వార్తలతో చాలా మంది సెలబ్రీటీలు ఇబ్బందులకు గురౌతున్నారు. తాజాగా.. మాజీ విశ్వసుందరీ ఐశ్వర్యరాయ్ కూతురు మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది.
గతంలో అనేక మీడియాలు, యూట్యూబ్ లలో ఐశ్వర్యరాయ్ కూతురు హెల్త్ గురించి ఫెక్ వార్తలు ప్రచారం చేశాయి. ఆరాధ్య ఆరోగ్యం అస్సలు బాగాలేదని కొన్ని మీడియా ఛానెల్ లు ప్రచురించాయి.
మరికొన్ని యూట్యూబ్ లు, మీడియాలు, సోషల్ మీడియాలలో ఏకంగా ఆరాధ్యలేరని కూడా కథనాలు ప్రచురించాయి. దీనిపై ఆరాధ్య బచ్చన్ గతంలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. గూగుల్ నుంచి వెంటనే వీటిని తొలగించేలా ఆదేశించాలని పిటిషన్ ను దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. గూగుల్ కు స్పష్టమైన అలాంటి కంటెంట్ ను వెంటనే తొలగించాలని గూగుల్‌కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి కథనాలను వెంటనే గూగుల్ తొలగించాలని తెల్చిచెప్పింది.
అయితే.. ఇప్పటికి అనేక యూట్యూబ్ లలో , మీడియాలలో కంటెంట్ ను తొలగించలేదని మరోసారి ఆరాధ్య కోర్టులో కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు పిటిషన్ ను మార్చి 17 కు వాయిదా వేసింది.