Sobhita: నాగచైతన్య పై సీరియస్ అయినా శోభిత..అంతా ఆ హీరోయిన్ వల్లే..!

Sobhita Naga Chaitanya : తండేల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకున్నారు. శోభిత ధూళిపాళను 'బుజ్జి తల్లి' అని పిలుస్తానని వెల్లడించడంతో పాటు, ఆమె కథలపై తనతో అభిప్రాయాలను పంచుకుంటుందని తెలిపారు. 
 

1 /5

తండేల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. యాంకర్ సుమ కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలను ప్రదర్శించారు. చైతన్య విషయంలో కూడా ఒక ఫోటో చూపించి, దాని గురించి వివరించాలని కోరగా, ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.    

2 /5

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి ఫోటో వైరల్ అవుతున్న సందర్భంలో, సుమ చైతన్యను ఓ డైలాగ్ లేదా పాటను డెడికేట్ చేయాలని కోరారు. దీనికి చైతన్య స్పందిస్తూ, "బుజ్జి తల్లి" పాటను దీనికి చేస్తాను చెప్పారు. అంతేకాదు, తన నిజజీవితంలో కూడా శోభితను 'బుజ్జి తల్లి' అని పిలుస్తానని వెల్లడించారు. దర్శకుడు చందూ మోండేటితో కూడా ఈ విషయం షేర్ చేసినట్లు చెప్పారు.  

3 /5

చందూ మోండేటి మాట్లాడుతూ, "చైతన్య, శోభిత పెళ్లికి హాజరైనప్పుడు, చైతు శోభితాని గుచ్చి తల్లి అని పిలవడం విన్నాను,” అని చెప్పకొచ్చాడు. అయితే, సినిమా పాటలో అదే పేరు వినిపించడం ఆమెను ఆశ్చర్యపరిచిందట. పాట విడుదలైన తర్వాత శోభిత ఆగ్రహానికి గురయ్యారట. దీనిపై చైతన్య కూడా స్పందిస్తూ, "ఆమెకు ఈ పేరు చాలా ప్రత్యేకమైనది, సినిమా పాటలో వాడినప్పుడు చాలా సీరియస్ అయింది." అని తెలిపారు.  

4 /5

తండేల్ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో, చైతన్య శోభితతో కథల గురించి చర్చిస్తారా? ఆమె నుంచి సూచనలు తీసుకుంటారా? అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి చైతన్య స్పందిస్తూ, "అవును, ఖచ్చితంగా నేను శోభితను అడుగుతాను. మేమిద్దరం మా అభిప్రాయాలను షేర్ చేసుకుంటాం. ఆమె ఆలోచనా విధానం చాలా మంచిగా ఉంటుంది" అని తెలిపారు.    

5 /5

సమంతతో విడాకుల అనంతరం చైతన్య-శోభిత డేటింగ్ వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆగస్టు 8, 2024న నిశ్చితార్థం చేసుకున్నట్లు నాగార్జున అధికారికంగా ప్రకటించారు. అనంతరం డిసెంబర్ 4, 2024న అన్నపూర్ణ స్టూడియోలో సంప్రదాయ పద్ధతిలో చైతన్య, శోభిత వివాహం జరిగింది.