Cheapest Medical Colleges: దేశంలో ఉన్న ప్రముఖ మెడికల్ కళాశాలల్లో ఇప్పటికీ అత్యంత తక్కువ ఫీజు ఉన్నవి చాలా ఉన్నాయి. ఇవి కేవలం ఫీజు తక్కువగా ఉండటమే కాకుండా బాగా ప్రాచుర్యం పొందిన కళాశాలలు కావడం విశేషం. అవేంటో తెలుసుకుందాం
ఈ అన్ని కళాశాలల్లో అడ్మిషన్ పొందాలంటే నీట్ పరీక్షలో ఉత్తీర్ణులవాలి. నీట్ లేకుండా మెడికల్ కోర్సులు కావాలంటే బయోటెక్నాలజీ, బయో మెడికల్ ఇంజనీర్, ఫిజియోథెరపీ వంటి కోర్సులున్నాయి.
మహారాజా అగ్రసేన్ మెడికల్ కళాశాల, ఆగ్రా ఈ కళాశాల దేశంలోని ప్రముఖ కళాశాలల్లో ఒకటి. ఈ కళాశాలలో ఫీజు 1,020,100 రూపాయలు.
ఉస్మానియా మెడికల్ కళాశాల, హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఫీజు 6 లక్షల రూపాయలు. వైద్య విద్యార్ధులకు చాలా బెస్ట్ ఆప్షన్
క్రిస్టియన్ మెడికల్ కళాశాల, వెల్లూరు వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కళాశాల ఇండియాలోని బెస్ట్ కళాశాలలో ఒకటి. ఈ కళాశాలలో ఫీజు 1,12,750 రూపాయలు. ఈ కళాశాల చాలా ప్రాశస్త్యమైంది
బెంగళూరు మెడికల్ కళాశాల ఇది బెంగళూరులో ఉంది. ఈ కళాశాలలో ఫీజు 72,670 రూపాయలుంది. ఇందులో అటు బోధన ఇటు చికిత్స రెండూ అద్భుతంగా ఉంటాయి.
ఆర్ జి కర్ మెడకల్ కళాశాల, కోల్కతా కోల్కతాలోని ఆర్ జి కర్ మెడికల్ కళాశాల ఆసియాలోనే అత్యంత ప్రాచీనమైంది. ఈ కళాశాలలో ఎంబీబీఎస్ ఫీజు 66,520 రూపాయలు.
మీరు ఒకవేళ ఎంబీబీఎస్ చదవాలని అనుకుంటూ ఫీజులు ఎక్కువగా ఉన్నాయని ఆలోచిస్తుంటే ఈ న్యూస్ మీ కోసమే. దేశంలోని టాప్ 8 మెడికల్ కళాశాలలివే. వాటి గురించిన వివరాలు