Anasuya About Nagarjuna: అనసూయ తన పై వచ్చిన పుకార్లపై స్పష్టత ఇచ్చింది. ఆమె పాడ్‌కాస్ట్ లో చేసిన వ్యాఖ్యలు.. రూమర్స్, క్యాస్టింగ్ కౌచ్ ఇలా ఎన్నో వాటిపై క్లారిటీ వచ్చేలా చేశాయి. ముఖ్యంగా తనకు నాగార్జున కార్ కొనిచ్చారు అనే దాని గురించి సైతం మాట్లాడింది ఈ నటి. పూర్తి వివరాల్లోకి వెళితే..
అనసూయ గురించి ఇండస్ట్రీలో పుకార్లు తరచుగా వినిపిస్తుంటాయి. హీరోహీరోయిన్లు కలిసి కనిపిస్తే, వారిద్దరి మధ్య ఏమైనా సంబంధం ఉందని అనుకుంటారు. అలా, అనసూయ కూడా పుకార్ల నుండి తప్పించుకోలేకపోయింది. ఈ తరహా పుకార్లు.. తనకు పెళ్లయి పిల్లలు ఉన్నా కానీ తరచూ వినిపిస్తూ వచ్చాయి. ఇక వీటి పైన పలుమార్లు ఈనాటి ఆగ్రహం సైతం వ్యక్తం చేసింది
ముఖ్యంగా అక్కినేని నాగార్జున ఆమెకు ఆడీ కారు గిఫ్ట్ ఇచ్చాడని పుకార్లు షికార్లు చేశాయి. ఈ పుకార్లు గురించి అనసూయ తన పాడ్‌కాస్ట్ లో క్లారిటీ ఇచ్చింది. ఇది పూర్తిగా అసత్యమని తెలిపింది. “నేను కూడా నాకు నాగార్జున కార్ బహుమతిగా ఇచ్చారన్న రూమర్స్ విన్నాను కానీ వాటిల్లో ఎటువంటి నిజం లేదు,” అని చెప్పుకొచ్చింది.
ఇక ఇదే ఇంటర్వ్యూలో అనసూయ, ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ పై కూడా మాట్లాడింది. తనని కొంతమంది హీరోలు రమ్మని అడిగారని.. అలానే దర్శకుడు కూడా అలా అన్నవారు ఉన్నారని.. అయితే తాను వాటికి ఒప్పుకోలేదని చెప్పింది. వాళ్లు అడిగిన తర్వాత తాను ఫ్రెండ్లీ గానే తనకు ఇష్టం లేదని చెబుతానని.. వాళ్లల్లో కొంతమంది అర్థం చేసుకొని మళ్లీ ఆ టాపిక్ ఎత్తకుండా ఇప్పటికీ తనతో ఫ్రెండ్స్ గా ఉండే వాళ్ళు ఉన్నారని చెప్పుకొచ్చింది.
ఇక అనసూయ తనకు ఎవరో ఏవో గిఫ్టులు ఇచ్చారు అని వస్తున్న వార్తలు అన్ని అసత్యమని. తను అలానే తన భర్త కష్టంతో అన్ని సంపాదించుకుందామని చెప్పుకొచ్చింది. "నేను, మా భర్త కష్టపడి పనిచేస్తూ, స్వతహాగా సంపాదించి జీవిస్తున్నాం" అని చెప్పింది. కేవలం కష్టంతోనే ఈ స్థాయికి వచ్చినట్టు తెలియజేసింది.