Actress: ఎమ్మెల్యే కొడుకుతో పెళ్లి కోసం మతం మార్చుకున్న హీరోయిన్.. పదహారేళ్ల తర్వాత బయటపడిన నిజం..!

Bollywood Actress Shocking: నాగార్జున సినిమా సూపర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ఆయేషా టాకియా. ఆ తర్వాత పెద్దగా తెలుగులో కనిపించకపోయినా కానీ హిందీలో మాత్రం ఎన్నో సినిమాలలో నటించింది. పెళ్లయిన పదహారేళ్ల తర్వాత తాను ప్రేమించిన వ్యక్తి కోసం మతం మార్చుకున్నాను అని తెలిపి ఆశ్చర్యపరిచింది. 

1 /5

ఆయేషా టాకియా.. ప్రముఖ బాలీవుడ్ నటి గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ,  తన కెరీర్లో కేవలం కొన్ని చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపును సొంతం చేసుకోలేదు.  ఇక ఆయేషా టాకియా తన కెరియర్ లో ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు సినిమాకి వీడ్కోలు పలికి, రాజకీయ కుటుంబానికి కోడలు కావాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ప్రముఖ వ్యాపారవేత్త ఫర్హాన్ అజ్మీని వివాహం చేసుకుంది. 

2 /5

ఆయేషా టాకియా నటించిన చిత్రాల విషయానికి వస్తే.. టార్జాన్ ది వండర్ కార్, వాంటెడ్, డోర్ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఎప్పుడూ కూడా సినిమాల కంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తల్లోనే ఎక్కువగా నిలిచేది. ఇక పెళ్లైనప్పుడు ఈమె వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే. అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే కొడుకును వివాహం చేసుకోవడానికి ఏకంగా మతాన్ని కూడా మార్చుకొని ఫర్హాన్ అజ్మీని వివాహం చేసుకుంది. ఇక పెళ్లికి ముందు వీరిద్దరూ మూడేళ్లపాటు డేటింగ్ లో కూడా ఉన్నారు. 

3 /5

ఫర్హాన్ అజ్మీ విషయానికి వస్తే , ఈయన సమాజ్వాద్ పార్టీ సీనియర్ నాయకుడు అబూ అజ్మీ కుమారుడు.ఫర్హాన్ రెస్టారెంట్ పరిశ్రమలో కొనసాగుతున్నారు. వివాహం చేసుకున్న తర్వాత ఆమె తన మతాన్ని మార్చుకొని ఆయేషా టకియా అజ్మీగా మారిపోయింది. అయితే పదహారేళ్ల తర్వాత ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి చెప్పుకొచ్చింది ఆయేషా. 

4 /5

ఆయేషా మాట్లాడుతూ.. ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటానని అనుకోలేదు . జీవితంలో సరదా ఏంటంటే తదుపరి మలుపు చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇక అతడిని  వివాహం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను అంటూ తెలిపింది. మొత్తానికైతే ప్రేమించిన వ్యక్తి కోసం జీవితాన్ని పంచుకోవడానికి మతాన్ని కూడా మార్చుకుంది ఆయేషా. 

5 /5

ప్రస్తుతం ఆయేషా షేర్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా వివాహం తర్వాత ఇన్నేళ్లకు అసలు విషయం చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.