Telangana BC Survey: ప్లానింగ్ మిషన్అందించే ఈ నివేదికపై సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆది, సోమవారాల్లో చర్చ జరుగుతుంది. అనంతరం ఈ నెల 5న రాష్ట్ర కేబినెట్ లో ఈ అంశాన్ని చర్చించి ఆమోదించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై కులగణన తోపాటు ఎస్సీ వర్గీకరణ నివేదికపైనా చర్చించనుంది. బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనునుంది తెలంగాణ ప్రభుత్వం. అటు ఎస్సీ వర్గీకరణపైనా ప్రకటన చేయనున్నట్టు తెలిసింది. శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం తర్వాత సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ చేపట్టిన కులగణనపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఉన్నందున ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కేబినెట్ లో, శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై తేల్చడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను సీఎం ఆదేశించారు.
కులగణన నివేదిక రెడీ అయిందని తెలియగానే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఏర్పాటుచేశారు. ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా అందించే కులగణన నివేదికపై సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాంబర్లో ఆయనతోపాటు కో -చైర్మన్ అయిన మంత్రి దామోదర రాజా నర్సింహ, ఇతర మంత్రి వర్గ సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి హాజరై ఆది, సోమవారాల్లో చర్చిస్తారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
కులగణన నివేదికను కేబినెట్ సబ్ కమిటీ 5వ తేదీ ఉదయం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం కోసం పంపుతుంది. కేబినెట్ ఆమోదం అనంతరం అదే రోజు మధ్యాహ్నం నిర్వహించనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో కులగణన తుది నివేదికను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. శాసనసభలో దానిపై చర్చించి.. తీర్మానం చేసి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్రానికి పంపిస్తుంది. అదే సమయంలో లోకల్ బాడీ ఎన్నికల్లో అమలుచేయనున్న బీసీ రిజర్వేషన్లపైనా ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చిన నివేదికను కూడా మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి.. అసెంబ్లీలో ప్రకటన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.