Tollywood Actress: ఎంగేజ్మెంట్ ఒకరితో.. ప్రేమ మరొకరితో.. పెళ్లి గురించి మాత్రం తెలీదంటున్న హీరోయిన్..!

Tollywood Herione Marriage: ప్రస్తుతం ప్రేమ ఒకరితో, పెళ్లి మరొకరితో అనే కాన్సెప్ట్ సర్వసాధారణమైపోతోంది. ముఖ్యంగా సినిమా సెలబ్రెటీస్ దీనిని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. కొంతమంది ఏకంగా పెళ్లిళ్లు అయ్యాక రెండో పెళ్లి చేసుకుంటూ ఉంటే.. మరి కొంతమంది మాత్రం నిశ్చితార్థం అయ్యాక.. వాటిని ఆపేసుకుని మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కి సంబంధించిన ఇలాంటి కథ వైరల్ అవుతోంది.
 

1 /5

తెలుగు సినీ పరిశ్రమలో రష్మిక మందన్న ఒక స్టార్ హీరోయిన్. వరుస హిట్లతో అగ్రస్థానానికి చేరుకున్న ఈ అమ్మడు, తన వ్యక్తిగత జీవితం గురించి చాలాసార్లు.. మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ హీరోయిన్ తాజాగా పెళ్లి, ప్రేమ, నిశ్చితార్థం వంటి విషయాలతో సంచలనంగా మారింది. 

2 /5

రష్మిక తన కెరీర్‌లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నది. "పుష్ప" సినిమాతో నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన ఆమె, ఆ తర్వాత "యానిమల్" సినిమాలో బోల్డ్‌గా నటించి మరొకటి హిట్ కొట్టింది. ప్రస్తుతం "పుష్ప-2" సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని ఆస్వాదిస్తూ ఎన్నో సినిమా ఆఫర్లతో దూసుకుపోతోంది.

3 /5

కాగా తను రష్మిక ప్రేమ, పెళ్లి విషయాలపై ఇటీవల సరదాగా స్పందించింది. తమిళనాడులో జరిగిన పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె తన ప్రేమ గురించి మాట్లాడింది. ఆమె నవ్వుతూ, "నా ప్రేమ గురించి అందరికి తెలుసు" అంటూ పేర్కొంది. అయితే తన పెళ్లి గురించి మాత్రం ఎక్కడా చెప్పలేదు ఈ హీరోయిన్. ప్రేమ గురించి అడిగినప్పుడు అందరికీ తెలుసు అంటూ చెప్పుకోస్తున్న రష్మిక పెళ్లి గురించి అడిగితే మాత్రం తెలియదు అంటుంది.  

4 /5

కాగా ఈ హీరోయిన్స్.. గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం జరిగింది. అయితే ఆ తర్వాత అనుకోని కారణాలవల్ల వీరిద్దరి మధ్య బ్రేకప్ అయ్యింది.

5 /5

ఇక చాలా రోజుల నుంచి..విజయ్ దేవరకొండతో రష్మిక ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరు కలిసి రెస్టారెంట్‌లో.. లేదా ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూ వచ్చారు. దీనితో వీరి డేటింగ్ రూమర్స్ నిజమయ్యాయన్న చర్చలు ముదిరాయి. ఈ క్రమంలో కొంతమంది రష్మిక నిశ్చితార్థం ఒకరితో.. జరగక ప్రేమాయణం మాత్రం మరొక హీరోతో మెరుపుతోందని.. పెళ్లి గురించి అడిగితే మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి రష్మిక ప్రేమ పైన క్లారిటీ ఇచ్చినట్టే.. ఆ ప్రేమించిన వ్యక్తి ఎవరు.. అలానే ఎప్పుడు పెళ్లి చేసుకోబోతోంది అనే విషయాలపై ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.