Union Budget 2025: ఎంతో కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కార్పోరేట్ రంగంలో పనిచేసే వేతన జీవులు తాజాగా కేంద్రం ప్రకటించిన శ్లాబ్ సిస్టంతో ఎంతో లాభపడనున్నారు. తాజాగా పెంచి ఇంకమ్ శ్లాబు పరిమితిని రూ. 8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 ఆర్ధిక సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. మొత్తంగా ఈ నిర్ణయంతో దాదాపు ప్రతి వంద కుటుంబాల్లో దాదాపు 40 శాతం మంది లాభపడునున్నారు.
వేతన పరిమితితో పాటు పత్తి ఉత్పాదకత పెంచేందుకు కేంద్రం స్పెషల్ మిషన్ ను ఏర్పాటు చేసింది.మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త హంగులు. అన్ని ప్రభుత్వ స్కూల్స్‌కు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించనున్నారు. పదేళ్లలో ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపు చేయనున్నారు. ఐఐటీ పాట్నా విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు. విద్యారంగంలో AI వినియోగం ఐదేళ్లలో అదనంగా 75 వేల మెడికల్ సీట్లు పెంచబోతున్నారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
బీహార్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ. రూ.30 వేలతో స్ట్రీట్ వెంటర్స్‌కు క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నారు.బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం-నిర్మలా సీతారామన్. MSMEలకు ఇచ్చే రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచనున్నారు.స్టార్టప్‌లకు ఇచ్చే రుణాలు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచనున్నారు. అసోంలో 12.7 లక్షల టన్నుల యూరియా ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక గ్రామీణ ఎకానమీలో లక్షన్నర గ్రామీణ పోస్టాఫీసుల పాత్ర ఉంది. వాటికి జనసత్వాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.