Govt Employees Salary Payment: అపర రాజకీయ మేధావి.. వ్యూహకర్త.. తెలంగాణను తీసుకువచ్చి అభివృద్ధి పరచిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. 'రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది. మున్ముందు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి వస్తుంది' అని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తుత్తోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కేసీఆర్ చెప్పిన మాటలు వాస్తవమవుతాయని పూర్తిగా విశ్వవిస్తున్నారు. అసలు ఏం జరిగింది? కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వెనుక వాస్తవం ఏమిటి? అనేది తెలుసుకుందాం.
Also Read: Retirement Age: ఉద్యోగులపై పేలిన భారీ బాంబు.. 65 ఏళ్లకు పెరిగిన రిటైర్మెంట్ వయస్సు
సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ రాజకీయ వ్యాఖ్యలు.. విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణను కైలాసంలో పెద్ద పాము మిగినట్లు తయారైంది. రైతు భరోసా ఇస్తారో.. లేదో? రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఆదాయం ప్రతి సంవత్సరం పెరిగిపోతే.. కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గిపోతుంది. రూ.13 వేల కోట్ల ఆదాయం పడిపోయిందని కాగ్ నివేదిక తెలిపింది. పరిస్థితులు ఇంకా దారుణంగా మారుతాయి. నాలుగు నెలలు గడిస్తే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది' అని కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు.
Also Read: Dearness Allowance: హెచ్ఆర్ఏ, డీఏ ఎప్పుడు ఇస్తారు? యూనివర్సిటీ ఉద్యోగుల పోరుబాట
'జీతాలు ఇవ్వలేని పరిస్థితి' అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను పట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు భయాందోళన చెందుతున్నారు. కేసీఆర్ చెప్పింది వాస్తవమేనని ఇటీవల జరుగుతున్న పరిణామాలను గుర్తుచేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రభుత్వ ఉద్యోగులు గ్రహించారు. ఈ క్రమంలోనే నిరసనలకు దిగారు. ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు కానీ ఎలాంటి మార్పు రాలేదు. ఒకటో తేదీన జీతం అని గొప్పలకు తప్ప చేతలకు లేదని అర్థమైంది. డీఏలు ఇంకా పెండింగ్‌లో ఉండగా.. పీఆర్సీ ఊసే ఎత్తడం లేదు.. పాత పింఛన్ విధానం మరచిపోయారు. మరోవైపు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే రిటైర్మెంట్ వయసును పెంచేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఇప్పటికే విశ్వవిద్యాల ప్రొఫెసర్ల వయసును 60 నుంచి 65కు పెంచింది.
తాజాగా చేసిన కేసీఆర్ వ్యాఖ్యలు వాస్తవానికి అద్దం పట్టాయని ప్రజల్లో చర్చ జరుగుతోంది. తమ విషయమై కేసీఆర్ ప్రకటన చేయడంతో ఉద్యోగ వర్గాలు ఆలోచనలో పడ్డాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలలు అలా మొదటి తారీఖును జీతం వేసి ఉన్నారని.. ఆ తర్వాత వేళకు అందించడం లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. పదవీ విరమణ వయస్సు పెంపు వార్తలు వినిపిస్తున్న తరుణంలో కేసీఆర్ చేసిన ప్రకటన దానికి నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొంటున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడీన పెట్టాల్సిన పరిస్థితి నుంచి కుదేలయ్యేట్టు పరిపాలనా విధానాలు ఉండడంతో ఇప్పుడు రాష్ట్రానికి వస్తున్న ఆదాయం తగ్గుతోంది.
రోజువారీ కార్యకలాపాలకు మినహా పెద్ద కార్యక్రమాలు ఏవీ అమలు చేయడానికి సరిపడా నిధులు లేని పరిస్థితి. అప్పులు పెరుగుతున్నా దానికి తగ్గట్టు పనులు చేయకపోగా.. ఆదాయం సృష్టించే మార్గాలు అన్వేషించడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కేసీఆర్ చెప్పిన 'జీతాలు చెల్లించే పరిస్థితి ఉండదు' అనేది వాస్తవమవుతుందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. సీఎంగా కేసీఆర్ ఉంటే ఎలాగోలా చేసి ఉద్యోగులతోపాటు అన్ని వర్గాలకు సమానంగా చూసుకున్న రోజులను అందరూ గుర్తుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు త్వరలోనే ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.