Telangana High Court: సినిమా థియేటర్లకు 16ఏళ్లలోపు పిల్లలు.. కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు

Telangana High Court: సినిమా థియేటర్లకు 16ఏళ్లలోపు పిల్లలు వెళ్లే సమయం వేళలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాత్రి 11గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు 16ఏళ్ల లోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించకూడదని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.   

Written by - Bhoomi | Last Updated : Jan 27, 2025, 10:27 PM IST
Telangana High Court: సినిమా థియేటర్లకు 16ఏళ్లలోపు పిల్లలు.. కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు

Telangana High Court: సినిమా థియేటర్లకు 16ఏండ్లలోపు పిల్లలు వెళ్లే సమయ వేళలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాత్రి 11గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు 16ఏండ్ల లోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించకూడదని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది. సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి గురించి  దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేశారు. 

వేళాపాల లేకుండా షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు..ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 22వ తేదీకి వాయిదా వేసింది. 

Also Read: Saraswati River Pushkaralu 2025: మే 15 నుంచి సరస్వతీ నది పుష్కరాలు..భారీగా నిధులు మంజూరు చేసిన తెలంగాణ సర్కార్ 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

Trending News