Employees Retirement Age Likely Increase: ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త ఆందోళన మొదలైంది. పదవీ విరమణ వయస్సు విషయంలో గందరగోళం ఏర్పడుతోంది. ఇప్పటికే ఒకసారి రిటైర్మెంట్ వయసు పెంచగా.. తాజాగా మరోసారి వయస్సు పెంచుతారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. దానికి తాజాగా ఆర్ కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలతో మరింత చర్చనీయాంశంగా మారాయి. మరోసారి పదవీ విరమణ వయసు పెంచుతారని.. ఏకంగా 65 ఏళ్ల వరకు పెంచే అవకాశాలు ఉన్నాయని ఆర్ కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపాయి.
Also Read: Retirement Age: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. పదవీ విరమణ వయస్సు తగ్గించాలని జేఏసీ ఆందోళన
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచే ఆలోచన చేస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం తెలంగాణ నిరుద్యోగ జేఏసీ సమావేశం జరిగింది. నిరుద్యోగుల సమస్యలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ క్రమంలోనే పదవీ విరమణ వయస్సు పెంపు అనేది నిరుద్యోగులకు శాపంగా మారుతోందని నిరుద్యోగులు ఆందోళన చెందారు.
Also Read: Pending Arears: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. త్వరలో పెండింగ్ ఏరియర్స్ చెల్లింపు
ఈ సందర్భంగా ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 'నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 58 ఏళ్లు ఉన్న విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచారు' అని గుర్తుచేశారు. వయస్సు పెంపుతో నిరుద్యోగుల పొట్ట గొట్టారని విమర్శించారు. నిరుద్యోగ యువత మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సును పెంచి.. నిరుద్యోగులకు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న రేవంత్ రెడ్డి తన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో పదవీ విరమణ వయస్సు పెంపుతో మరోసారి నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టేలా రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఆర్ కృష్ణయ్య తెలిపారు.
పదవీ విరమణ వయస్సు పెంపుతో ఉద్యోగుల్లోను పని చేసే శక్తి ఉండదని పేర్కొన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చే శక్తి లేకపోవడంతోనే పదవీ విరమణ వయస్సును పెంచేందుకు చూస్తున్నారని వివరించారు. నిరుద్యోగులను మోసం చేసే ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. పదవీ విరమణ వయస్సు పెంచితే మాత్రం నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని రేవంత్ రెడ్డికి ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.