Janhvi Kapoor: జాన్వి కపూర్ గురించి సౌత్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచాయలు అవసరం లేదు. శ్రీదేవి కూతురు గానే కాకుండా ప్రస్తుతం తన అందం, నటనతో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో సినిమాలతోనే కాకుండా తన పర్సనల్ లైఫ్ ద్వారా కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ హీరోయిన్.
శ్రీదేవి కూతురు జాన్వి కపూర్.. ఈ మధ్యనే జూనియర్ ఎన్టీఆర్ దేవరా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల కాకముందు కూడా జాన్వి కపూర్ కి సౌత్ ఇండియాలో అభిమానులు లేకపోలేదు. శ్రీదేవి కూతురు కావడం వల్ల జాన్వికి.. తను బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి తెలుగులో కూడా అభిమానులు ఏర్పడ్డారు.
కాగా జాన్వి కపూర్ ఇప్పటికే హిందీలో ఎన్నో సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఆర్సి 16 సినిమాల్లో కూడా ఈ అమ్మడు కనిపించనుంది.
సినిమాల విషయం పక్కన పెడితే తన పర్సనల్ లైఫ్ ద్వారా కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది జాన్వికపూర్. జాన్వీ..శిఖర్ పహాడియాని ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి గురించి బోనీ కపూర్ కూడా ఈ మధ్యనే వెల్లడించారు. ఈ క్రమంలో జాహ్నవి కపూర్ ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
తనకు పీరియడ్స్ అప్పుడు ఎక్కువగా మోద స్వింగ్స్ ఉంటాయని.. ఆ టైంలో తన బాయ్ ఫ్రెండ్‌కి బ్రేకప్ కూడా చెప్పాను అని తెలిపింది. మొదట్లో ఇలానే తాను..శిఖర్ కి బ్రేకప్ చెప్పాక.. రెండు మూడు రోజులకు అంతా సెట్ అయ్యేదట. ఇలా చాలాసార్లు జరిగేదట. అయితే మళ్లీ తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసిపోయేదట. కానీ మొదటి సారి బ్రేకప్ చెప్పినప్పుడు మాత్రం తన బాయ్ ఫ్రెండ్ షాక్ అయ్యాడట.
ఇక ఈ తర్వాత తర్వాత తన పరిస్థితి.. పీరియడ్స్ అప్పుడు తనకు వచ్చే మూడ్ స్వింగ్స్‌ను అర్థం చేసుకున్నాడట. ఆ తరువాత ఎన్ని సార్లు బ్రేకప్ చెప్పినా ఏమీ కాలేదని, వెంటనే కలిసిపోయే వాళ్లమని చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్.