PM Kisan Yojana 19th Installment: రైతులకు కేంద్రం అదిరిపోయే శుభవార్తను చెప్పనుంది. వచ్చే నెల నుంచి రైతులకు పదివేలు జమ చేయనుంది.. ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రూ. 6000 జమ చేస్తున్న సంగతి తెలిసిందే.. రైతుల వ్యవసాయ పెట్టుబడులకు ఇది సహాయకారంగా ఉంటుంది. అయితే ఆ పరిమితిని కేంద్రం పదివేలకు పెంచుతుందని వారు ఎదురుచూస్తున్నారు.
పీఎం కిసాన్ యోజన ద్వారా లబ్ది పొందుతున్న రైతులు వచ్చేనెల ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశంలో నిర్మలమ్మ ఈ పథకంపై గుడ్ న్యూస్ చెప్తుందని ఎదురు చూస్తున్నారు. కిసాన్ సమ్మాన్ నిధులు రూ. 6000 నుంచి రూ.10000 కు పెంచుతారని అంచనా వేస్తున్నారు. దీనిపై బడ్జెట్ మొదటి రోజే ప్రకటించే అవకాశం ఉంది.
ప్రతి ఏడాది రూ.6000 చొప్పున రైతుల ఖాతాలో నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా ఈ డబ్బులు జమ అవుతున్నాయి. మూడు దశల్లో ఈ డబ్బులు రూ.2000 చొప్పున జమ చేస్తారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న రైతులు లబ్ధి పొందుతున్నారు. వారికి ఆర్థిక చేయూత అందుతుంది.
ఇప్పటివరకు 18 విడతల్లో రైతులకు పీఎం కిసాన్ నిధులు అందాయి. కిసాన్ సామాన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న చేయూత. 19వ విడుద నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. అది ఫిబ్రవరి మొదటి వారంలో జమ అవ్వచ్చు అని అంచనా వేస్తున్నారు. 18వ విడుత నిధులు అక్టోబర్ 5వ తేదీన జమ చేశారు.
2019లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో రిజిస్టర్ చేసుకున్న రైతులు ఈ నిధుల లబ్ధి పొందుతున్నారు. అయితే ఈ పథకం డబ్బులు పొందాలంటే ముందుగా కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఆన్లైన్లో బెనిఫిషరీ స్టేటస్ కూడా చెక్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. అయితే ఈ పథకానికి అర్హులు కావాలంటే తగిన భూ రికార్డులు, మొబైల్ నెంబర్, బ్యాంకు ఖాతా వివరాలు కలిగి ఉండాలి
అయితే ఇప్పటివరకు 2019 అంతకుముందు భూమి రిజిస్టర్ అయిన వారికి మాత్రమే ఈ రైతు కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను క్రెడిట్ చేస్తున్నారు. ఆ తర్వాత భూమి రికార్డులు ఉన్నవారికి ఇంకా ఈ పథకంలో రిజిస్టర్ చేసుకునే అవకాశం రాలేదు. దీనిపై ఎంతో మంది రైతులు ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. కుటుంబంలో కేవలం ఒక్కరికి మాత్రమే ఈ ప్రయోజనం లభిస్తుంది.