Nizamabad Turmeric Board Starts Today: తెలంగాణ రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. సంక్రాంతి సందర్భంగా పసుపు బోర్డు ప్రారంభించనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేడు అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఇది తెలంగాణ రైతులకు సంక్రాంతి పండుగ భారీ కానుక.
తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పసుపు బోర్డు వచ్చేసింది. నేటితో ఆ ఎదురుచూపుకు ఫుల్ స్టాప్ పడబోతుంది. పసుపు బోర్డు ఈరోజు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ల కలకు తెరపడనుంది. తెలంగాణ రైతులకు నిజంగా ఇది సంక్రాంతి కానుక.
కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నారు.. ఇటీవల బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంక్రాంతి పండుగ జనవరి 14వ తేదీ పసుపు బోర్డు ఏర్పాటు ప్రారంభం కానుంది. ఈ రోజే ప్రత్యేకంగా ప్రారంభించాలనుకున్నారు.
ఇచ్చిన హామీ వరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ పసుపు బోర్డుకు చైర్మన్‌గా నిజాంబాద్ కు చెందిన పల్లె గంగారెడ్డిని నియమించనుంది . పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి నిన్నే కేంద్రం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
నిజామాబాద్ లో ఏర్పాటుకు కానున్న ఈ పసుపు బోర్డుతో అక్కడి రైతులు మెషినరీ కూడా తక్కువ ధరలో పొందుతారు. అంతేకాదు రైతులకు క్రయ విక్రయాల్లో కూడా మరింత ప్రోత్సాహం లభించనుంది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పసుపు బోర్డు అక్కడ ఏర్పాటు చేయాలని కోరింది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ ఏర్పాటు చేస్తోంది.
ఇక నేడు నిజామాబాద్‌లో ప్రారంభం కానున్న పసుపు బోర్డుకు కేంద్ర వాణిజ్య వ్యవసాయ శాఖ అధికారులు ఇతర రాష్ట్ర పరిశ్రమల వ్యవసాయ అధికారులు కూడా పాల్గొననున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా కొందరు ముఖ్య రాజకీయ నేతలు హాజరు కానున్నారు. ఇక ఈ పసుపు బోర్డు ఏర్పాటుతో ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.