Sankranti Muggulu 2025: ఈ సులభమైన ముగ్గుల డిజైన్స్ ఇంతవరకు ముగ్గులు వేయలేని వారు కూడా తక్కువ సమయంలో వేయొచ్చు. ఏంటి నమ్మట్లేదా ఒక్కసారి ఈ డిజైన్స్ చూడండి. అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా మీ ఇంటి ముందు వేసుకోండి.
Sankranti Muggulu 2025 Images: సంక్రాంతి, భోగి, కనుమ రోజున చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ముగ్గులు వేస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లోనైతే మహిళలతో పాటు పురుషులు కూడా ముగ్గులు పెడతారు. సంక్రాంతి పూట మహిళలు ముగ్గులు పెట్టడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే పండగ వచ్చిందంటే చాలు ఐదు రోజుల ముందే ఇంటిముందు కొత్త కొత్త వెరైటీ ముగ్గులను వేస్తారు. ఈ సంవత్సరం కూడా ఏమాత్రం తగ్గకుండా మేము అందించే సులభమైన ముగ్గుల డిజైన్స్ ను చూసి ఇంటిముందు పరిచేయండి.
సంక్రాంతి సందర్భంగా ఇంటిముందు చాలామంది పక్షులతో కూడిన ముగ్గులు కూడా వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది రామచిలకల ముగ్గులు వేసుకుంటూ ఉంటారు. అయితే మీరు కూడా ఈ పండగ సందర్భంగా ఈ సులభమైన రామచిలుక డిజైన్ ముగ్గును వేసుకోండి.
ఎంతో సింపుల్‌గా వేసుకుని ముగ్గులు ఈ కొత్త డిజైన్ కూడా ఒకటి. ఇందులో భాగంగా మధ్యలో ఒక చిలుక.. పక్కన తామర పువ్వులు గమనించవచ్చు. ఈ డిజైన్ కూడా ఎంతో సులభంగా వేసుకోవచ్చు..
కలర్స్ నింపిన రామచిలకల ముగ్గును మీరు కూడా ఈ సంక్రాంతి సందర్భంగా వేయాలనుకుంటున్నారా? ఈ సులభమైన డిజైన్‌తో మీ వాకిలి నిండా సంక్రాంతి రామచిలకల ముగ్గును పరిచేయండి.
ఇక మరో డిజైన్ వివరాల్లోకి వెళ్తే.. ఈ డిజైన్లు హంసలు కనిపించడం మీరు చూడవచ్చు. ఇందులో ముగ్గు మధ్యలో రెండు హంసలు, వాటి చుట్టూ గుండ్రని ముగ్గును చూడవచ్చు. ఈ డిజైన్ కూడా మీ వాకిట్లో సులభంగా వేసుకోవచ్చు.
ఇంటి ముందు తక్కువ స్పేస్ ఉన్నవారు ఈ ఒక్క చిలుక ముగ్గు డిజైన్ వేసుకోండి. దీనికోసం ముందుగా చిలుకను గీసి అందులో ఫోటోలో విధంగా గ్రీన్ కలర్‌ను ఫీల్ చేయండి. ఆ తర్వాత మిగతా ముగ్గు వేసుకొని వాటిలో కూడా కలర్స్ బాగా ఫిల్ చేయండి.
కొంతమంది సంక్రాంతి పండగ రోజున వీణ, నెమలితో కూడిన ముగ్గులు కూడా వేసుకుంటారు. అందులో భాగంగానే ఈ కొత్త డిజైన్.. దీనిని గీయడం చాలా సులభం. ఈ ముగ్గు గీసిన తర్వాత తప్పకుండా కలర్స్ వేస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది.
ఇంటిముందు చిన్న స్పేస్ ఉన్నవారు కూడా వేసుకునే ముగ్గులు ఇది ఒకటి.. ఈ చిలుక ముగ్గును ఎంతో సులభంగా.. ముగ్గుల వేయని వారు కూడా వెయ్యొచ్చు. ఈ సంక్రాంతి పూట ఒక్కసారి ఈ ముగ్గుని ట్రై చేసి చూడండి.