Central Bank Of India Job Recruitment 2025: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్ తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్లో వెల్లడించారు. అయితే పూర్తి వివరాలు తెలుసుకోండి.
Central Bank Of India Job Recruitment 2025: నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వీట్ న్యూస్ తెలిపింది. సంక్రాతికి ముందే శుభవార్తను వచ్చింది. ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ అనే విభాగంలో ఖాళీ ఉన్న జాబ్స్ భర్తీ చేయబోతున్నట్లు Central Bank of India నోటిఫికేషన్లో వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా చేసుకునే సదుపాయాన్ని అందిస్తోంది. అర్హత కలిగి అభ్యర్థులు అన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ నోటిఫికేషన్‌ను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఉద్యోగం పొందడానికి ఏదైనా డిగ్రీ అయిన పాస్ పూర్తి చేసిన పర్వలేదు.
అంతేకాకుండా ఈ బ్యాంక్ ఉద్యోగం అప్లై చేసుకోవడానికి IIBF ద్వారా ఫోరెక్స్ సర్టిఫికేట్ కూడా పొందాల్సి ఉంటుంది. అంతేకాకుండా సంబంధిత రంగాల్లో కూడా రెండు సంవత్సరాల పని చేసి ఉండాల్సి ఉంటుంది.
అలాగే ఈ ఉద్యోగంలో భాగంగా ప్రొబిషన్ పీరియడ్ కూడా ఉంటుంది. ఎంపికైన వారు తప్పకుండా ఆరు నెలల శిక్షణ అందించబోతున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు. ఈ నోటిఫికేష్‌లో మొత్తం 150 పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ దరఖాస్తు ప్రక్రియ జనవరి 03 నుంచి ప్రారంభమవుతుంది. దీనిని జనవరి 23 తేది లోపు ఆన్లైన్లో అప్లై చేసే వారిని మాత్రమే అభ్యర్థులుగా పరిగణిస్తారు. దీనికి కనీస వయస్సు 23 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది.
అప్లై చేసుకునేవారు షార్ట్ లిస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ప్రక్రియ కూడా ఉంటుంది. అయితే దీనిని అప్లై చేసుకోవడానికి ప్రతి అభ్యర్థి రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో సెలక్ట్ అయిన వారికి హైదరాబాద్‌తో పాటు కోల్ కత్తాలో పోస్టింగ్ ఇవ్వబోతున్నట్లు కూడా నోటిఫికేషన్‌తో తెలిపారు.