Samantha: పెళ్లికి ముందు చైతును బెదిరించిన సమంత.. వెలుగులోకి షాకింగ్ విషయం.. స్టోరీ ఏంటంటే..?

Naga Chaitanya: సమంత పెళ్లికి ముందు తనను దారుణంగా బెదిరించిందని ఒక ఇంటర్వ్యూలో చైతు మాట్లాడిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది. దీంతో మరోసారి చైతు, సామ్ లు వార్తలలో నిలిచారు.
 

1 /6

సాధారణంగా సెలబ్రీటీల ప్రేమ,పెళ్లిళ్లు,పర్సనల్ లైఫ్ లు తరచుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఎవరితో మాట్లాడిన  ఏదో లింక్ పెట్టేస్తుంటారు. పొరపాటున కలిస్తే.. లేనీ పోనీ ఎఫైర్ లు క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో తరచుగా సెలబ్రీటీల పర్సనల్ లైఫ్ లు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి.

2 /6

తాజాగా.. సమంత, నాగచైతన్య మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే.. చైతు గతంలో సమంతతో కలిసి ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట ట్రెండింగ్ గా మారింది. దీంట్లో చైతు సరదాగా.. సామ్ గురించి మాట్లాడిన మాటలు మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.  

3 /6

నాగచైతన్యకు, సామ్ కు మధ్య ఏమాయచేసావే మూవీ నుంచి ఇద్దరు కూడా  ఒకర్ని ఒకరు ఇష్టపడ్డ విషయం తెలిసిందే. అయితే.. వీరిద్దరు ఆటోనగర్ సూర్య, మజిలీ, మనం వీరిద్దరి కాంబోలో మంచి హిట్ ను సొంతం చేసుకున్నాయి.   

4 /6

అదే విధంగా వీరిద్దరు 2017 లో అనుహ్యంగా పెద్దల అంగీకారంలో పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్ల పాటువీరి కాపురం సజావుగానే సాగింది. అయితే.. ఏం జరిగిందో కానీ.. 2021 లో మాత్రం ఇద్దరు విడిపోతున్నట్లు ప్రకటించి.. ఇండస్ట్రీని షాకింగ్ కు గురిచేశారు. అయితే.. ఇప్పటికి వీరు ఎందుకు విడిపోయారన్నదానిపై మాత్రం సస్సెన్స్ గానే మిగిలిందని చెప్పుకొవచ్చు..  

5 /6

గతంలో చైతు సామ్ తో పెళ్లికి ముందు.. వీరి లవ్ స్టోరీని ఇంట్లో వాళ్లకు చెప్పేందుకు చాలా భయపడినట్లు చైతు ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ సమంత మాత్రం మన రిలేషన్ ను కుటుంబ సభ్యులకు చెప్పాలని... పెళ్లి చేసుకుందామని ఫోర్స్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. కానీ చైతు మాత్రం.. దీనిపై భయపడిపోతే.. సామ్ మాత్రం..కోపంతో.. ఇంట్లో వాళ్లకు చెప్తావా.. లేదా రాఖీ కట్టేయమంటావా.. అని దబాయించిందనే విషయాన్నికూడా రివీల్ చేశాడు.    

6 /6

అప్పుడు కానీ చైతు సామ్ తో ఉన్న ప్రేమను.. ఇంట్లో వాళ్లకు చెప్పలేదన్నాడు. ఈ విషయాన్ని చైతు స్వయంగా గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్ మారింది. దీంతో సామ్, తన మాజీ భర్త చైతుల మధ్య గతంలో జరిగిన ఘటన మరోసారి వార్తలలో నిలిచింది.