All India Institute Of Medical Sciences Delhi Job Recruitment: నిరుద్యోగ యువతకు 2025 నంవత్సరం చాలా వరకు కలసి రాబోతోంది. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర సంస్థల్లో ఉన్న పలు ఖాళీలను భర్తీ ప్రభుత్వాలు చేపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకింగ్, ఇతర రంగాల్లో ఉన్న ఖాళీలకు భర్తీ నోటిఫికేషన్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. అయితే కేంద్ర సర్కార్ కూడా ఈ కొత్త ఏడాదిలో అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించిన కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2025 ఇటీవలే విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు తెలిపింది.
ఈ ప్రత్యేకమైన సాధరణ నోటిఫికేషన్లో భాగంగా గ్రూప్ బితో పాటు సికి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు వెల్లడించింది. అయితే ఈ నోటిఫికేషన్ నేరుగా న్యూఢీల్లీ నుంచి విడుదలైంది.
ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 4576 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రకటించింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా కొన్ని ప్రత్యేకమైన ఆర్హతాలను కూడా వెల్లడించింది. అయితే విద్యార్థాహాలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 10th, 12th , Degree చేసిన వారు దీనిని అప్లై చేసుకోవచ్చు.
ఇక వయస్సు పరిమితికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కనీస వయస్సు దాదాపు 18 సంవత్సరాల నుంచి ప్రారంభమై దాదాపు 35 సంవత్సరాల లోపు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనిని అప్లై చేసుకునే అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపికవుతారు. అలాగే ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
ఇందులో ఎంపికైన వ్యక్తులు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పే స్కేల్ జీతం ఇవ్వబోతున్నట్లు నోటిఫికేషన్ పేర్కొంది. ఇక దీని అప్లికేషన్ ఫీజు వివరాల్లోకి వెళితే.. అభ్యర్థులకు రూ.3,000 నుంచి ప్రారంభమవుతుంది. అయితే SC, ST, EWS అభ్యర్థులకు మాత్రం రూ. 2,400 ఫీజు ఉంటుంది.
అప్లై చేసుకునేవారు ఈ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంబంధించిన అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది. రాత పరీక్ష ఫిబ్రవరి 26 నుంచి ఫిబ్రవరి 28వ తేదిల మధ్యల్లో ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.