Junior Ntr paid hospital bills: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ అంత వివాదాల్లో ఉన్నట్లు తెలుస్తొంది. ఫెమస్ నటీనటులంతా ఏదో ఒక అంశంతో వార్తలలో ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ ఏపీసోడ్ ప్రస్తుతం దేశ రాజకీయాల్లోనే కాకుండా.. ఇండస్ట్రీలో సైతం కాకరేపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గతంలో కౌశిక్ అనే తన అభిమాని క్యాన్సర్ ట్రీట్మెంట్ ఖర్చులు భరిస్తారని భరోసా ఇచ్చారు.
అయితే.. ఆతర్వాత మాత్రం ముఖం చాటేశారని.. కౌశిక్ తల్లి సరస్వతి తాజాగా ఆరోపణలు చేసింది. ఆమె ముఖ్యంగా.. ఎన్టీఆర్ దేవర రీలీజ్ సమంలో ఈ విధంగా అన్నారని.. సినిమా తర్వాత కనీసం తమను ఎవరు సంప్రదించలేదని.. తాము ప్రయత్నిస్తే.. ఎవరు అందుబాటులోకి రాలేదని కూడా ఫైర్ అయ్యారు.
ఈ నేపథ్యంలో ఇటీవల సరస్వతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారాయి. దీనిపై ముఖ్యంగా..పొలిటికల్ గా మాత్రమే కాకుండా.. ఇండస్ట్రీలో కూడా చర్చ కొనసాగింది. దీంతో దీనిపై ఎన్టీఆర్ ఈ వివాదానికి పుల్ స్టాప్ పెడదామని అనుకున్నారో ఏంటో కానీ.. అభిమాని ఆస్పత్రి బిల్ ను ఎన్టీఆర్ సెటిల్ చేసినట్లు తెలుస్తొంది.
దీంతో ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు సమాచారం. మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ వివాదాలకు, కాంట్రవర్సీ అంశాలకు దూరంగా ఉంటారు. ఈ క్రమంలో ఆయన సైలేంట్ గా అన్న మాట మీద నిలబడి సైలేంట్ గా ఆస్పత్రిబిల్ సెటిల్ చేసేసినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.