Gold Rate Today: ఆభరణాలు కొనే ప్లాన్‎లో ఉన్నారా? బంగారం ధర ఏకంగా రూ. 8000వేలు తగ్గింది.. వెంటనే కొనేయ్యండి

Gold Rate Today: మహిళలకు పండగలాంటి వార్త. నేడు డిసెంబర్ 24వ తేదీ మంగళవారం బంగారం ధర భారీగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,180గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,100 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధర మార్కెట్లో తగ్గానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే భవిష్యత్తులో బంగారం ధర పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆల్ టైం గరిష్టానికి చేరుకున్న బంగారం ధర ఏకంగా 8వేల రూపాయలు తగ్గింది. బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. 
 

1 /8

Gold Rate Today: మహిళలకు పండగలాంటి వార్త. నేడు డిసెంబర్ 24వ తేదీ మంగళవారం బంగారం ధర భారీగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,180గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,100 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధర మార్కెట్లో తగ్గానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. 

2 /8

 భవిష్యత్తులో బంగారం ధర పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆల్ టైం గరిష్టానికి చేరుకున్న బంగారం ధర ఏకంగా 8వేల రూపాయలు తగ్గింది. బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు.   

3 /8

దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం రోజుల నుంచి బంగారం ధర తగ్గుతూ వస్తోంది. నేడు డిసెంబర్ 24వ తేదీ మంగళవారం కూడా బంగారం ధర తగ్గింది. గత మూడు సెషన్లలో బంగారం ధర తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో డిసెంబర్ 24న 10 గ్రాముల బంగారం ధర రూ.570 తగ్గింది. దీంతో  రూ.76,180కి చేరుకుంది.

4 /8

ఆలిండియా బులియన్ అసోసియేషన్ ఈ సమాచారం ఇచ్చింది. PTI వార్తల ప్రకారం, బలమైన గ్లోబల్ ట్రెండ్‌ను అనుసరించి స్టాకిస్టులు, పెట్టుబడిదారులు కొనుగోలు చేయడం వల్ల గోల్డ్ మెటల్ ధర పెరిగిందని పేర్కొంది.   

5 /8

 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర మంగళవారం కూడా రూ.570 తగ్గి 10 గ్రాములకు రూ.76,180కి చేరుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో ఫిబ్రవరి డెలివరీకి సంబంధించిన గోల్డ్ కాంట్రాక్టులు రూ. 48 లేదా 0.06 శాతం తగ్గి 10 గ్రాములకు రూ.76,372కి చేరుకున్నాయి. విదేశీ మార్కెట్లలో, Comex గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కి $6.70 లేదా 0.25 శాతం తగ్గి 2,638 వద్దకు చేరుకుంది. ఔన్సుకు 40 డాలర్లు వచ్చింది.  

6 /8

ప్రస్తుతం జరుగుతున్న పెళ్లిళ్ల సీజన్‌లో స్టాకిస్టులు, ఆభరణాల వ్యాపారులు వాల్యూ కొనుగోళ్లు చేయడంతో బంగారం ధరలకు మద్దతు లభించిందని వ్యాపారులు తెలిపారు. అత్యంత అస్థిరమైన సెషన్‌లో బంగారం ధరలు ఒకటిన్నర నెలల కనిష్ట స్థాయి నుంచి కోలుకున్నాయని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలంత్రి తెలిపారు. డాలర్ ఇండెక్స్,  బాండ్ ఈల్డ్‌లలో ప్రాఫిట్-బుకింగ్ కనిపించడంతో బంగారానికి భారీగా డిమాండ్ ఏర్పడింది.   

7 /8

అయితే బంగారం ధర  తగ్గడానికి మరో కారణం అంతర్జాతీయం కూడా చోటుచేసుకున్న పరిణామాలే అని చెప్పవచ్చు. ప్రస్తుతం అమెరికా డాలర్ విలువ 85 రూపాయలు దాటింది. ఇంతకుముందు ఏనాడు లేని విధంగా డాలర్ బలపడింది. ఇది కూడా బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు.   

8 /8

అటు అమెరికాలో కీలకమైనటువంటి సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గించింది. దీంతో బంగారం ధరలు భారీగా తగ్గడం ప్రారంభమయ్యాయి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడిదారులు ఎక్కువగా ఆసక్తి చూపించడంతో బంగారం నుంచి తమ  పెట్టుబడులను నెమ్మదిగా స్టాక్ మార్కెట్ వైపు తరలిస్తున్నారు. దీంతో బంగారం ధర తగ్గుతూ వస్తోంది.