Siddharth Movies JCB Effect: సిద్ధార్థ మూవీ కి తెలంగాణలో బిగ్ షాక్ తగిలినట్లు అయింది. ఓ ప్రముఖ థియేటర్లో అయితే కేవలం 5 టికెట్లు బుక్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే పుష్ప 2 సినిమాపై జేసీబీ వ్యాఖ్యలు చేసినందుకే సిద్ధార్థ మూవీకి ఇలా బిగ్ షాక్ తగిలిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
హీరో సిద్ధార్థ్ మూవీ 'మిస్ యు' ఈరోజు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు తెలంగాణలో మాత్రం చెప్పుకోదగ్గ టికెట్స్ బుక్ కాలేవు. ప్రముఖ థియేటర్ అయిన సుదర్శన్ థియేటర్లో కేవలం 5 టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి.
దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని థియేటర్లలో ఏమాత్రం పెద్దగా టికెట్లు బుక్ కాలేదు.. మొత్తంగా కేవలం 50 టికెట్లు మాత్రమే బుక్ అయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదంతా కేవలం పుష్ప2 ఈవెంట్ పై హీరో సిద్ధార్థ చేసిన జెసిబి వ్యాఖ్యలే ప్రధాన కారణమని నెట్టిజనులు అభిప్రాయపడుతున్నారు... అయితే తమిళనాడు వ్యాప్తంగా 'మిస్ యూ' చిత్రం పై మంచి పాజిటివ్ టాక్ మాత్రం వస్తోంది.
జెసిబి వ్యాఖ్యలు ఏంటంటే పుష్ప2 బీహార్ ఈవెంట్ కు భారీగా జననం తరలివచ్చారు కదా.. అని ఓ ఇంటర్వ్యూలో అడిగారు. దానికి సిద్ధార్థ స్పందిస్తూ హీరో సిద్ధర్థా అదంతా మార్కెటింగ్ ప్రమోషన్ మన దేశంలో జెసిబిలు పనిచేసే చోట కూడా చాలామంది చూడడానికి వస్తారు. అని వ్యాఖ్యలు చేశారు.
అప్పుడే దీనిపై బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇదంతా అటెన్షన్ కోసమే సిద్ధార్థ ఇలా మాట్లాడుతున్నారని ఆయన ఈవెంట్లకు ఎవరు రారని కామెంట్స్ చేశారు... ఈ నేపథ్యంలో తాజాగా ఆయన నటించిన 'మిస్ యూ' మూవీ ఈరోజు విడుదల అయింది.. ఈ సినిమాకు తెలంగాణ వ్యాప్తంగా టికెట్లు బుక్ కాకపోవటంతో ఇది పుష్ప2 జెసిబి ఎఫెక్ట్ అంటున్నారు నెటిజెన్లు..
ఇక 'మిస్ యు' మూవీ ఈరోజు డిసెంబర్ 13న విడుదల అయింది. ఈ సినిమాలో అశిక రంగనాథ్ హీరోయిన్ గా నటించారు. అయితే ఇదే ఏడాది సిద్ధార్థ అదితి రావు హైదరీని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
పుష్ప2 సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. హిందీలో కూడా బిగ్ కలెక్షన్స్ రావటంతో బన్నీ ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటున్నారు. అయితే తాజాగా హీరో అల్లు అర్జున్ సినీ ఎంట్రీ ఇస్తారన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. కానీ ఈ వ్యాఖ్యలను అల్లు అర్జున్ అనుచరులు కొట్టి పారేశారు.