చలికాలం ఆరోగ్యపరంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. దాంతో చలిగాలుల ప్రభావం శరీరంపై అధికంగా ఉంటుంది. అందుకే చలికాలంలో సాధ్యమైనంతవరకూ హెల్తీ, ఎనర్జిటిక్ ఫుడ్స్ మాత్రమే తినాలి. చలికాలంలో 5 కీలకమైన పోషకాల కొరత లేకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Winter Nutrients: చలికాలం ఆరోగ్యపరంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. దాంతో చలిగాలుల ప్రభావం శరీరంపై అధికంగా ఉంటుంది. అందుకే చలికాలంలో సాధ్యమైనంతవరకూ హెల్తీ, ఎనర్జిటిక్ ఫుడ్స్ మాత్రమే తినాలి. చలికాలంలో 5 కీలకమైన పోషకాల కొరత లేకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
జింక్ జింక్ అనేది శరీరాన్ని బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. జింక్ లోపంతో ఇమ్యూనిటీ బలహీనమౌతుంది. చలికాలంలో నట్స్, సీడ్స్, పప్పులు, ఆకు కూరలు తప్పకుండా తినాలి
విటమిన్ సి విటమిన్ సి అనేది ఇమ్యూనిటీని పెంచేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది శరీరాన్ని వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. జలుబు, జ్వరం వంటి సమస్యల్నించి ఉపశమనం కల్గిస్తుంది. చలికాలంలో ఆరెంజ్, నిమ్మ, ఉసిరి, షిమ్లా మిర్చి, కూరగాయలు తప్పకుండా డైట్లో ఉండాలి.
ఐరన్ ఐరన్ లోపం ఏర్పడితే శరీరం బలహీనంగా మారుతుంది. ఇమ్యూనిటీ పడిపోతుంటుంది. దీనికోసం పాలకూర, బీట్రూట్, బ్రోకలీ, డ్రై ఫ్రూట్స్ తప్పకుండా తినాలి.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి స్వెల్లింగ్ సమస్య దూరం చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే చలికాలంలో గుండె వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికోసం చేపలు, వాల్నట్స్, ఫ్లక్స్ సీడ్స్ తప్పకుండా తినాలి
విటమిన్ డి చలికాలంలో ఎండ తక్కువగా ఉండటం వల్ల విటమిన్ డి కొరత ఏర్పడవచ్చు. విటమిన్ డి అనేది ఎముకలు పటిష్టంగా ఉండేందుకు, ఇమ్యూనిటీ బలంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. అందుకే చలికాలంలో గుడ్లు, మష్రూం, ఫోర్టిఫైడ్ మిల్క్ తప్పకుండా తీసుకోవాలి