/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

AP Heavy Rains: బంగాళాఖాతంలో విస్తరించిన ద్రోణి రేపటికి అల్పపీడనంగా మారనుంది. అక్కడి నుంచి తమిళనాడు, శ్రీలంక తీరం వైపుకు కదులుతూ వాయుగుండంగా బలపడవచ్చు. ఈ క్రమంలో ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు ముప్పు పొంచి ఉంది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడవచ్చు. 

నైరుతి బంగాళాఖాతంలో విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి రేపటికి అల్పపీడనంగా మారి ఆ తరువాత వాయుగుండంగా బలబడనుంది. దాంతో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడనున్నాయి. ఇవాళ్టి నుంచి మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, ఒంగోలు జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. ఇక కాకినాడ, కోనసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.  దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో రానున్న 3 రోజులు భారీ వర్షాలు తప్పేట్టు లేదు. నైరుతి బంగాళాఖాతం నుంచి తూర్పు మద్య బంగాళాఖాతం వరకూ వ్యాపించి ఉన్న ఉపరితల ద్రోణి రేపు అంటే మంగళవారం నాటికి అల్పపీడనంగా మారనుంది. అందుకే ఏపీలోని దక్షిణ కోస్తా ప్రాంతంలో బారీ వర్షాలు పడనున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు లేదా తేలికపాటి వర్షాలు పడవచ్చు. 

వర్షాల నేపధ్యంలో అన్నదాతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండనున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. 

Also read: AP Assembly Budget Session 2024 Live: రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్.. హైలెట్స్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
Andhra pradesh Weather Forecast low pressure in bay of bengal causes heavy rains in south coast for coming 3 days rh
News Source: 
Home Title: 

AP Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు రేపట్నించి ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు

AP Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు రేపట్నించి ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు
Caption: 
Heavy Rains in ap ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
AP Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు రేపట్నించి ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Monday, November 11, 2024 - 10:42
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
27
Is Breaking News: 
No
Word Count: 
198