Pakistan Court Annuls Pervez Musharrafs Death Sentence: ముషారఫ్‌కు భారీ ఊరట.. ఉరిశిక్ష రద్దు

మాజీ అధ్యక్షుడు Pervez Musharraf దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ముగ్గురు న్యామూర్తుల ధర్మాసనం విచారించింది. ముషారఫ్‌పై నమోదైన దేశద్రోహం కేసు చట్టంలోని నిబంధనల ప్రకారం నమోదు కాలేదని గుర్తించింది.

Last Updated : Jan 13, 2020, 07:18 PM IST
Pakistan Court Annuls Pervez Musharrafs Death Sentence: ముషారఫ్‌కు భారీ ఊరట.. ఉరిశిక్ష రద్దు

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ జనరల్ పర్వేజ్ ముషారఫ్‌కు భారీ ఊరట లభించింది. ఇటీవల ముషారఫ్‌కు ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ మరణశిక్షను లాహోర్ హైకోర్టు కొట్టివేసింది. ముషారఫ్ కేసు నిమిత్తం ఏర్పాటైన ప్రత్యేక కోర్టు చట్టవిరుద్ధమని, అందుకు ఎలాంటి విశ్వసనీయత లేదని హైకోర్టు వెల్లడించింది. తనకు విధించిన ఉరిశిక్ష తీర్పును ముషారఫ్ లాహోర్ కోర్టులో సవాల్ చేశారు. 

మాజీ అధ్యక్షుడు దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ముగ్గురు న్యామూర్తుల ధర్మాసనం విచారించింది. ముషారఫ్‌పై నమోదైన దేశద్రోహం కేసు చట్టంలోని నిబంధనల ప్రకారం నమోదు కాలేదని గుర్తించింది. దీంతో ముషారఫ్ ఉరిశిక్ష తీర్పు నుంచి విముక్తి పొందారని ఆయన తరఫు న్యాయవాది చెబుతున్నారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2007లో పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ విధించారు ముషారఫ్. ఆయన ఆదేశానుసారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సైతం హౌస్ అరెస్ట్ చేశారు. 

మీడియాపై ఆంక్షలు విధించడంతో పాటు పెద్ద సంఖ్యలో న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించి తప్పిదం చేశారు. ప్రజలు ముషారఫ్‌కు వ్యతిరేకంగా రోడ్లమీదకు వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఘటన జరిగిన ఆరేళ్లకు 2013లో ముషారఫ్ దేశద్రోహానికి పాల్పడ్డారని కేసు నమోదు కాగా, మరో ఆరేళ్లపాటు విచారణ జరిగింది. చివరగా గతేడాది డిసెంబర్‌లో ముషారఫ్‌కు మరణశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ముషారఫ్ కేసులో ఏర్పాటైన న్యాయమూర్తుల ధర్మాసనం చట్టబద్ధమైనది కాదని, కనుక వారు నమోదు చేసిన అభియోగాలు వెలువడిన తీర్పు చట్టబద్ధం కాదని ప్రభుత్వం తరఫు న్యాయవాది ఇస్తియాక్ ఏ ఖాన్ మీడియాకు వివరించారు.

Also Read: మసీదులో పేలుడు.. 15 మంది మృతి!

ముషారఫ్ తొలిసారి 1999లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను పదవీచ్యుతుడిని చేసి బాధ్యతలు స్వీకరించారు. అయితే అమెరికా పెంటగాన్ టవర్స్‌పై దాడుల (సెప్టెంబర్ 11 దాడుల) అనంతరం అమెరికాతో మైత్రి చెడింది. అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లకాలంలో మూడు పర్యాయాలు అల్ ఖైదా ఆత్మాహుతి దాడుల నుంచి సురక్షితంగా బయటపడటం గమనార్హం. దుబాయ్‌కి మకాం మార్చిన ముషారఫ్ అక్కడే నివాసం ఉంటున్నారు.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News