Stock Market Today: భారీగా నష్టపోయిన సెన్సెక్స్.. ఏకంగా 981 పాయింట్లు ఢమాల్.. ఒక్కరోజులో ఆవిరైన 6 లక్షల కోట్లు

Sensex, Nifty 50 crash: స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున పతనం కనిపిస్తోంది. ముఖ్యంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లను విక్రయించడంతో, దేశీయంగా మార్కెట్లలో పెద్ద ఎత్తున నష్టం కనిపించింది. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ ఒకరోజులోనే 940 పాయింట్లకు పైగా నష్టపోయింది.
 

1 /7

Stock Market Today: స్టాక్ మార్కెట్లలో ఈరోజు పెద్ద ఎత్తున నష్టాలు నమోదయ్యాయి. ముఖ్యంగా సెన్సెక్స్ ఈరోజు దాదాపు 941 పాయింట్ నష్టపోయి 78,782 పాయింట్లు వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 39 పాయింట్లు నష్టపోయి 23,995 పాయింట్లు వద్ద ముగిసింది. 

2 /7

మార్కెట్లలో ఈరోజు పెద్ద ఎత్తున నష్టపోవడానికి కారణం ఆసియా మార్కెట్లలో నెలకొన్నటువంటి పతనమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు జపాన్ కు చెందిన సూచి నిక్కి 2.63 శాతం నష్టపోవడంతో ఈరోజు దేశీయ మార్కెట్లలో పెద్ద ఎత్తున పతనం కనిపించింది.

3 /7

సెక్టర్ల పరంగా చూసినట్లయితే, దాదాపు అన్ని సెక్టార్లలో కూడా అమ్మకాలు కనిపించాయి. ముఖ్యంగా నిఫ్టీ ఎఫ్ఎంసీజి సూచి ఈరోజు ఏకంగా ఒక శాతం పైన నష్టపోయింది. అలాగే నిఫ్టీ ఫార్మా సూచీ కూడా 0.74% నష్టపోయింది. ఇక బ్యాంకు నిఫ్టీ 0.89 శాతం నష్టపోయింది. అలాగే నిఫ్టీ మెటల్ సూచీ కూడా దాదాపు 1.57 నష్టపోయింది. ఆటో సూచీ కూడా దాదాపు ఒక శాతం మేర నష్టపోయింది. 

4 /7

ఇక బ్యాంకు నిఫ్టీ విషయానికొస్తే బ్యాంకింగ్ స్టాక్స్ లో ప్రధానంగా యాక్సిస్ బ్యాంక్ 2.59 శాతం నష్టపోయింది. అలాగే కెనరా బ్యాంక్ 1.97 శాతం నష్టపోయింది. అలాగే HDFC, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా 1 శాతం చొప్పున నష్టపోయాయి. అయితే ఆసక్తికరంగా ప్రభుత్వ బ్యాంకులు మాత్రం లాభపడ్డాయి అందులో ఎస్బిఐ 1 శాతం పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2 శాతం మేర లాభపడ్డాయి

5 /7

మెటల్ స్టాక్స్ లో కూడా పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా టాటా స్టీల్ 2 శాతం నష్టపోయింది. అలాగే వేదాంత కూడా 2 శాతం నష్టపోయింది. జిందాల్ పవర్ స్టీల్ కూడా 2 శాతం నష్టపోగా,జిందల్ ఇండస్ట్రీస్ కూడా 2.4 శాతం నష్టపోయింది. నిఫ్టీ కి చెందినటువంటి స్టాక్స్ లో ప్రధానంగా టాప్ లూజర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రోజు 2.73 శాతం నష్టపోయింది.   

6 /7

దీంతో ఇన్వెస్టర్లకు చెందిన మార్కెట్ క్యాప్ పెద్ద ఎత్తున నష్టపోవడానికి కారణం అయ్యింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సూచీలోనే హెవీ వెయిట్ గలిగిన స్టాక్ కావడం విశేషం. మార్కెట్ క్యాప్ పరంగా హెవీ వెయిట్ స్టాక్స్ పతనం అయినప్పుడల్లా మార్కెట్లు  భారీగా పతనం అవుతాయి. అలాగే హెవీ వెయిట్ స్టాక్స్ లో ఉన్న టీసీఎస్ 0.5 శాతం, అదానీ పోర్ట్స్ 3 శాతం, హీరో మోటో కార్ప్ గరిష్టంగా 4 శాతం, భారత్ పెట్రోలియం 3 శాతం చొప్పున నష్టపోయాయి. 

7 /7

చైనా తాజా స్టిమ్యూలస్ ప్యాకేజీ ప్రకటన దేశీయ స్టాక్‌లలో అమ్మకాలను ప్రేరేపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు కనికరం లేకుండా విక్రయించడం కూడా ఈక్విటీ మార్కెట్‌లోని సెంటిమెంట్‌లను దెబ్బతీసిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు మార్కెట్ క్యాప్ పరంగా చూస్తే దాదాపు 6 లక్షల కోట్లు నష్టం వాటిల్లింది.