TP Gopalan Nambiar passed away: టెలివిజన్ కంపెనీ దిగ్గజం బిపిఎల్ గ్రూప్ చైర్మన్ డిపి గోపాలన్ ఇకలేరు

TP Gopalan Nambiar: ప్రతి ఇంట్లోనూ టెలివిజన్ ద్వారా పరిచితమైన బిపిఎల్ ఎలక్ట్రానిక్స్ అధినేత టీపీ గోపాలన్ నంబియార్ నేడు కన్నుమూశారు. 94 సంవత్సరాల నంబియార్ భారత దేశంలో ఎలక్ట్రానిక్స్ రంగానికి పితామహుడుగా పేర్కొంటారు. ఆయన  లేని లోటు పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సైతం సంతాపం తెలియజేశారు.   

Written by - Bhoomi | Last Updated : Oct 31, 2024, 09:05 PM IST
TP Gopalan Nambiar passed away: టెలివిజన్ కంపెనీ దిగ్గజం బిపిఎల్ గ్రూప్ చైర్మన్ డిపి గోపాలన్ ఇకలేరు

BPL Group founder TP Gopalan Nambiar passed away: భారతదేశంలో హోం అప్లియెన్సెస్ లో అగ్రగామి సంస్థగా నిలిచిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బీపీఎల్ గ్రూప్ వ్యవస్థాపకుడు టీపీ గోపాలన్ నంబియార్ గురువారం కన్నుమూశారు. ఈ టీపీ గోపాలన్ నంబియార్ కుటుంబ సభ్యులు ఈ విషయాన్న ఒక ప్రకటన ద్వారా  పంచుకున్నారు. నంబియార్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..94 ఏళ్ల గోపాలన్ నంబియార్ కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఈరోజు ఉదయం 10.15 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు వారు తెలిపారు. టి.పి.గోపాలన్ నంబియార్‌కి కేరళ, కర్ణాటక రెండు రాష్ట్రాలతో ప్రత్యేక అనుబంధం ఉంది.

టి.పి.గోపాలన్ నంబియార్ మృతిపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప సోషల్ మీడియా పోస్ట్‌లో, “బిపిఎల్ గ్రూప్ వ్యవస్థాపకుడు టిపి గోపాలన్ నంబియార్ మరణవార్త నాకు బాధ కలిగించింది. ఆయన టెక్నాలజీ ప్రపంచానికి అందించిన సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. మాజీ కేంద్ర మంత్రి, బిజెపి నేత రాజీవ్ చంద్రశేఖర్‌కు టి.పి గోపాలన్ నంబియార్ సొంత మామ కావడం విశేషం. తన మామగారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన రాజీవ్ చంద్రశేఖర్, బిపిఎల్ గ్రూప్ చైర్మన్ టిపిజి నంబియార్ మృతి గురించి తెలియజేయడం చాలా బాధగా ఉందని తెలియజేశారు. ఆయన లేని లోటు తన కుటుంబంతో పాటు యావత్ జాతికి కూడా తీరని నష్టం చేకూరుస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. 

నంబియార్ దేశంలోనే అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌లలో ఒకటైన BPLని ప్రారంభించి చరిత్ర సృష్టించారు. నేటికీ ప్రజలకు కలర్ టీవీ అంటే బిపిఎల్ టీవీ అని పిలిచే స్థాయికి ఆయన కంపెనీ చేరింది. ఆయన వ్యక్తిత్వం, దూరదృష్టి, కారణంగా దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ కంపెనీగా బిపిఎల్ అవతరించింది. 

Also Read: Money: మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీంలో అప్లై చేసుకుంటే మీ ఇంటి శ్రీమతి అవుతుంది...లఖ్‌పతి   

కేరళకు చెందిన ప్రముఖ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ కూడా గోపాలన్ నంబియార్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు మరియు ఆయనను దూరదృష్టి గల పారిశ్రామికవేత్తగా అభివర్ణించారు. శశి థరూర్ మాట్లాడుతూ, టి.పి.జి. నంబియార్ మరణవార్త వినడం బాధాకరంగా ఉందన్నారు. అతను 1961లో బ్రిటిష్ ఫిజికల్ లాబొరేటరీస్‌ (బీపీఎల్) ను కొనుగోలు చేసిన తర్వాత, పాలక్కాడ్‌లో అత్యాధునిక ఫెసిలిటీస్ స్థాపించారని, ఎలక్ట్రానిక్స్ తయారీలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారని, కేరళకు చెందిన ఒక దూరదృష్టి కలిగిన పారిశ్రామికవేత్త అని కొనియాడారు. ఇదిలా ఉంటే భారతదేశంలో కోట్లాదిమంది ప్రజలకు బిపిఎల్ కంపెనీతో విడదీయరాని సంబంధం ఉంది. మన దేశంలో కలర్ టీవీ విప్లవం ప్రారంభమయ్యాక అత్యధిక టీవీలో అమ్ముడుపోయిన కంపెనీగా బిపిఎల్ పేరు సంపాదించింది.

Also Read: Gold Rates Today: దీపావళి రోజు పసిడి ప్రియుల గుండెల్లో లక్ష్మీ బాంబులా పేలిన బంగారం ధర.. తొలిసారి రూ. 82,000 దాటిన పసిడి

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News