MEIL Donation: బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌ పంచన చేరిన మేఘా కృష్ణారెడ్డి.. రూ.200 కోట్ల విరాళం

Megha Krishna Reddy Donates Rs 200 Cr To Telangana: ఇన్నాళ్లు రాజకీయాల కోసం విమర్శించిన వ్యక్తినే తిరిగి రేవంత్‌ రెడ్డి తన పంచన చేర్చుకున్నారు. కేసీఆర్‌పై విమర్శలకు పావుగా వాడుకున్న మేఘా కృష్ణారెడ్డిని కాంగ్రెస్‌ జట్టు కట్టింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 26, 2024, 11:37 PM IST
MEIL Donation: బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌ పంచన చేరిన మేఘా కృష్ణారెడ్డి.. రూ.200 కోట్ల విరాళం

Megha Krishna Reddy: పదేళ్లు తెలంగాణను పరిపాలించిన బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతునిచ్చిన ప్రముఖ కాంట్రాక్టర్‌ మేఘా కృష్ణారెడ్డి ఇప్పుడు అధికారం కోల్పోయిన కేసీఆర్‌ను వదిలేసి కాంగ్రెస్‌ పంచన చేరారు. గతంలో మేఘా కృష్ణారెడ్డిని తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన రేవంత్‌ రెడ్డి ఇప్పుడు అతడికే కాంట్రాక్టలు అప్పగిస్తున్నారు. మేఘా కృష్ణారెడ్డితో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. తాజాగా రేవంత్‌ రెడ్డిని కలిసిన కృష్ణారెడ్డి ఊహించని రీతిలో తెలంగాణ ప్రభుత్వం రూ.200 కోట్ల విరాళం ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో చిరకాలం శత్రువులు ఎవరూ ఉండరనేది కృష్ణారెడ్డి, రేవంత్‌ను చూస్తే అర్థమవుతోంది.

Also Read: Constable Row: కానిస్టేబుళ్ల భార్యల పోరాటానికి దిగి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

 

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో  నిర్మించేందుకు  ఎంఈఐఎల్ (మేఘా ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌) ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా రూ.200 కోట్ల భారీ విరాళాన్ని తెలంగాణకు ఇచ్చింది. ఈ మేరకు రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రభుత్వం తరఫున  స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్‌వీఎస్‌ఎస్‌ సుబ్బారావు, మెయిల్‌ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి  శనివారం అవగాహన ఒప్పందం చేసుకున్నారు.

Also Read: Congress: ఒక్కటవుతున్న 'ఒరిజినల్‌ కాంగ్రెస్‌'.. జీవన్‌ రెడ్డికి జగ్గారెడ్డి మద్దతు

 

నిర్మాణాల బాధ్యత
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో నిర్మాణం కానున్న స్కిల్ యూనివర్సిటీలో అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్, లేబొరేటరీ  బ్లాక్‌లు, గ్రంథాలయం, కంప్యూటర్ హబ్, విద్యార్థి, సిబ్బంది వసతి సముదాయాలు, పార్కింగ్, ఫుడ్ కోర్ట్, వివిధ రకాల సౌకర్యాలు, 700 మంది కూర్చునేలా భారీ ఆడిటోరియం, సమావేశ మందిరాలు, భద్రతా , ఇతర సిబ్బంది  గృహ సముదాయాలను మెయిల్ ఫౌండేషన్ నిర్మించనుంది. ఈ మేరకు ప్రభుత్వంతో ఆ సంస్థ ఒప్పందం చేసుకుంది. 

రేవంత్ రెడ్డి హర్షం
ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడిందన్నారు. మేఘా విరాళంతో యూనివర్సిటీ క్యాంపస్‌లో అవసరమైన  భవనాలన్నింటినీ నిర్మించే బాధ్యతలను చేపట్టనుండడంపై హర్షం వ్యక్తం చేశారు. తమ ఫౌండేషన్ దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తుందని మెయిల్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి తెలిపారు.  యువతలో నైపుణ్యతను  ప్రోత్సహించేందుకు ఇప్పటికే తమ ఫౌండేషన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook

 

Trending News