APSRTC Special Buses: భక్తులకు గుడ్‌న్యూస్, కార్తీకమాసంలో ప్రత్యేక బస్సులు, ఎక్కడికంటే

APSRTC Special Buses: కార్తీకమాసం వచ్చేస్తోంది. భక్తులంతా పుణ్యక్షేత్రాలు సందర్శించే సమయం వచ్చింది. ఈ క్రమంలో ఏపీఎస్సార్టీసీ భక్తులకు గుడ్‌న్యూస్ అందించింది. విజయవాడ నుంచి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రత్యేక బస్సు ప్యాకేజీలు ప్రారంభించింది. అత్యంత తక్కువ ధరకే కార్తీకమాసం ప్యాకేజీలు అందిస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 31, 2024, 10:21 PM IST
APSRTC Special Buses: భక్తులకు గుడ్‌న్యూస్, కార్తీకమాసంలో ప్రత్యేక బస్సులు, ఎక్కడికంటే

APSRTC Special Buses: హిందూ భక్తులకు ఆర్టీసీ శుభవార్త. పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా విజయవాడ నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనుంది. విజయవాడ నుంచి త్రిలింగ దర్శిని, అరుణాచలం, శ్రీశైలం, పంచారామాలు, శబరిమలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఆర్టీసీ నడపనున్న ప్రత్యేక బస్సు ప్యాకేజీలో పంచారామాలు, త్రిలింగ దర్శిని, అరుణాచలం గిరి ప్రదర్శన, శబరిమల వంటి పుణ్యక్షేత్రాలున్నాయి. ఈ ప్యాకేజ్ వివరాలు ఇలా ఉన్నాయి. 

పంచారామాల దర్శన ప్యాకేజీ. ఇందులో భాగంగా నవంబర్ 2,3,4,9,10,11 ,15,16,17,23,24,25 తేదీల్లో పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పుణ్యక్షేత్రాల్ని సందర్శించవచ్చు. ఈ తేదీల్లో ఉదయం 4 గంటల నుంచి విజయవాడ నుంచి బయలుదేరుతాయి. అదే రాత్రికి పంచారామాల దర్శనం పూర్తవుతుంది. సూపర్ లగ్జరీ సర్వీసు టికెట్ ధర 1120 రూపాయలుగా నిర్ణయించారు. 

శ్రీశైలం యాత్ర..ఇందులో భాగంగా ప్రతి ఆదివారం ముఖ్యమైన రోజుల్లో ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా శబరిమల యాత్రకు వెళ్లేందుకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. త్రిలింగ దర్శిని ప్యాకేజీలో భాగంగా యాగంటి, మహానంది, శ్రీశైలం శైవ క్షేత్రాల్ని ఒకేసారి దర్శించుకోవచ్చు. ఈ బస్సులు ప్రతి కార్తీక శనివారం నాడు రాత్రి 8 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరుతాయి. టికెట్ ఒక్కొక్కటి 1800 రూపాయలుగా ఉంది. 

ఇక మరోవైపు అరుణాచలం, గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో తీసుకొచ్చింది ఏపీఎస్సార్టీసీ. అరుణాచలం, గిరి ప్రదక్షిణకు పౌర్ణమి రెండ్రోజుల ముందు నుంచి విజయవాడ నుంచి శ్రీకాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ పుణ్యక్షేత్రాలు దర్శించి పౌర్ణమి నాటికి అరుణాచలం చేరేలా ఏర్పాట్లు చేశారు. టిక్కెట్ ధర ఒక్కొక్కటి 2500 రూపాయలుగా నిర్ణయించారు. 

Also read: IPL 2025 Auction: ఐదుగురు కెప్టెన్లను వదులుకున్న ఫ్రాంచైజీలు, ఈసారి వేలంలో స్టార్ ఆటగాళ్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News