Flipkart Big Diwali 2024 Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ 2024 ప్రారంభమైంది. ప్లస్ సభ్యులకు ఇవాళ్టి నుంచి ఇతరులకు రేపట్నించి ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేకసేల్లో వివిధ కంపెనీల స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు, యాక్సెసరీస్‌పై భారీ డిస్కౌంట్ లభించనుంది. ముఖ్యంగా మోటోరోలా స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభించనున్నాయి. ఆ ఆఫర్లు ఇలా ఉన్నాయి
మోటోరోలా కంపెనీకు చెందిన Moto G45 5G స్మార్ట్‌పోన్ మార్కెట్ ధర 10,999 రూపాయలు కాగా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో 1000 రూపాయల డిస్కౌంట్‌తో 9,999 రూపాయలకే లభించనుంది. ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ కెమేరా, పెద్ద డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉన్నాయి. ఇక మరో ఫోన్ Moto G04s.ఈ ఫోన్ ధర 7,499 రూపాయలు కాగా ఇప్పుడు 6,999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఇందులో డాల్బీ అట్మాస్ ఫీచర్, 50 మెగాపిక్సెల్ కెమేరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉన్నాయి. ఇందులోనే మరో మోడల్ Moto G64 5G అసలు ధర 16,999 రూపాయలు కాగా ఏకంగా 2 వేల రూపాయలు తగ్గుతోంది. 14,999 రూపాయలకే తీసుకోవచ్చు. ఇది కాకుండా కొన్ని ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొంటే మరో 1000 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఇదే సిరీస్‌లో మరో మోడల్ Moto G85 5G ఫోన్ ధర 17,999 రూపాయలు కాగా ఇప్పుడీ సేల్‌లో భాగంగా 1000 రూపాయల తగ్గింపుతో 16,999 రూపాయలకు లభిస్తోంది. కొన్ని బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే మరో 1000 రూపాయలు తగ్గుతుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 నియో మార్కెట్ ధర 23,999 రూపాయలు కాగా 1000 రూపాయలు బ్యాంక్ ఆఫర్‌తో 22,999 రూపాయలకు తీసుకోవచ్చు. ఇందులో కూడా 50 మెగాపిక్సెల్ కెమేరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పాటు మీడియా టెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ప్రోసెసర్ ఉంటుంది. ఇక ఇదే సిరీస్‌లో Motorola Edge 50 Fusion, Motorola Edge 50 Pro ఫోన్లపై కూడా 2 వేల తగ్గింపు లభిస్తోంది. Motorola Edge 50 Fusion అసలు ధర 22,999 రూపాయలు కాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో 2000 రూపాయలు డిస్కౌంట్ ఉంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పాటు 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉంది. ఇక Motorola Edge 50 Pro మార్కెట్ ధర 35,999 రూపాయలు కాగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో29,999 రూపాయలకే లభించనుంది. ఇది కాకుండా కొన్ని బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే 2000 రూపాయలు తగ్గింపు లభిస్తుంది. అంటే 27,999 రూపాయలకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.