Soaked Almonds and kishmish Benefits: బాదం, కిస్మిస్లలో విటమిన్ ఈ, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్పలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాదు జీర్ణ క్రియ కూడా ప్రోత్సహిస్తుంది. మీ చర్మం ఆరోగ్యకరంగా మెరుస్తూ కనిపిస్తుంది. నానబెట్టిన కిస్మిస్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి. ముఖ్యంగా ఇది కడుపుకు మంచిది చిన్న పిల్లలకు కూడా ఆరోగ్యకరం నానబెట్టిన కిస్మిస్ బాదం తరచూ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల స్థాయిలు కూడా తగ్గిపోతాయి.
నానబెట్టిన బాదం కిస్మిస్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..
ఎనర్జీ లెవెల్స్..
నానబెట్టిన బాదం, కిస్మిస్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫ్రక్టోజ్, గ్లూకోజ్ సహజ సిద్ధమైన శక్తి రూపంలోకి మారుతుంది దీంతో మీ ఎనర్జీ లెవెల్స్ రోజంతా ఉంటాయి. అంటే నానబెట్టిన కిస్మిస్ తీసుకోవడం వల్ల రోజంతటికీ కావాల్సిన శక్తి అందుతుంది. కిస్మిస్ నానబెట్టిన నీరు తీసుకోవడం వల్ల బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
జీర్ణ ఆరోగ్యం..
నానబెట్టిన ఈ బాదం కిస్మిస్ తీసుకోవడం వల్ల జీవ క్రియ కూడా మెరుగుపడుతుంది. దీంతో కడుపు సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా నానబెట్టిన కిస్మిస్లు ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి. వీటిని తరచూ మన డైట్లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి.
ఇదీ చదవండి: రైతులకు బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. ఎకరాకు రూ. 7500 జమా..!
గుండె ఆరోగ్యం..
నానబెట్టిన బాదం కిస్మిస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ కిస్మిస్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, బిపి లెవెల్స్ ని కూడా అదుపులో ఉంచుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు మీ దరిచేరకుండా ఉంటాయి.
బాదంతో బోలెడు లాభాలు..
నానబెట్టిన బాదం తీసుకోవటం వల్ల ఇందులో మోనోసాచ్యురేటెడ్ కవులు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ సమస్యను అధిరోహించాలంటే బాదం నానబెట్టి తీసుకోవాల్సిందే. ఉదయం తీసుకోవడం వల్ల నీరసం కూడా తగ్గిపోతుంది. ఇది రోజంతటికీ కావాల్సిన శక్తిని అందిస్తుంది. బాదంను డెజర్ట్, తీపి వంటకాల్లో మాత్రమే కాదు కూరల్లో కూడా వేసుకుని వండుకోవచ్చు.
ఇదీ చదవండి: 59 ఏళ్ల తర్వాత వస్తున్న అరుదైన యోగం.. ధన త్రయోదశి రోజు అదృష్టం కలిసి వచ్చే 5 రాశులు..!
అంతేకాదు బాదాన్ని నానబెట్టి తీసుకోవడం వల్ల యాంటీ న్యూట్రియేంట్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది ఎంజైమ్స్ ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఖనిజాలను గ్రహించే శక్తిని కలిగి ఉంటాయి. నానబెట్టిన బాదం కిస్మిస్ ప్రతిరోజు ఉదయం పరగడుపున తీసుకోవటం వల్ల బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.