Group 1 Aspirants Protest: సచివాలయం వద్ద హైటెన్షన్.. వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగులు

Group 1 Aspirants Protest Live Updates: అశోక్ నగర్ గ్రూప్-1 అభ్యర్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతుగా నిలిచారు. చలో సెక్రటేరియట్‌ ర్యాలీకి పిలుపునివ్వడంతో ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‌   

Written by - Ashok Krindinti | Last Updated : Oct 19, 2024, 04:53 PM IST
Group 1 Aspirants Protest: సచివాలయం వద్ద హైటెన్షన్.. వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగులు
Live Blog

Group 1 Aspirants Protest Live Updates: హైదరాబాద్‌లో గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నిరుద్యోగులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ‘చలో సెక్రటేరియట్’గా వెళుతున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కేంద్ర మంత్రిని ముందుకు వెళ్లకుండా పోలీసు ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలని చూడకుండా హాస్టళ్లలో చొరబడి కొట్టే అధికారం మీకెవరిచ్చారని పోలీసులపై మండిపడ్డారు. సీఎంను కలిసి వాస్తవాలు వివరించేందుకే సెక్రటేరియట్ వెళుతున్నామని స్పష్టం చేశారు. పోలీసులు గో బ్యాక్ అంటూ వేలాది మంది నిరుద్యోగులు నినదిస్తున్నారు. ట్యాంక్‌బండ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి..
 

19 October, 2024

  • 16:52 PM

    Group 1 Aspirants Protest Live: గ్రూప్ 1 మెయిన్స్  కోసం  బందోబస్తు ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. ఏ చిన్న ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అడ్డుకున్నా.. ఇబ్బందులకు గురిచేసినా చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. కోర్టు ఆదేశాల ప్రకారం పరీక్షలు సాగుతాయని స్పష్టం చేశారు. నిరసన పేరుతో రోడ్లపైకి వచ్చి పబ్లిక్‌కు ఇబ్బంది పెడితే చర్యలు తప్పవన్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని.. అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టును ఆశ్రయించుకోవచ్చని చెప్పారు.

  • 16:49 PM

    Group 1 Aspirants Protest Live: గ్రూప్‌-1 అభ్యర్థులకు మద్దుతుగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ దగ్గరకు భారీగా చేరుకుని.. సచివాలయం వైపు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
     

Trending News