monkey drinking alcohol video: సాధారణంగా చాలా మంది తమ ఇళ్లలో కుక్కలు, కోతుల్ని పెంచుకుంటారు. మరి కొంత మంది మేకలు, పిల్లుల్ని కూడా పెంచుకుంటారు. అయితే.. కోతులు అడవులు, కొండలు ఉన్న ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. అవి గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. ఏ మాత్రం మనం నెగ్లీజెన్సీగా ఉన్న కూడా అమాంతం ఇళ్లోలోకి వస్తుంటాయి. దొరికిన ఫుడ్ ను దొరికినట్లు లాక్కుని వెళ్లిపోతుంటాయి. కొన్నిసార్లు మనుషులపై కూడా దాడులు చేస్తుంటాయి.
కానీ కొన్నిసార్లు కోతి చేష్టలు చూస్తే మాత్రం తెగ నవ్వొస్తుంటుంది. అవి బట్టలను తమ తలపై వేసుకుంటాయి. వింత వింతగా ప్రవర్తిస్తుంటాయి. కానీ ఇటీవల అడవుల్లో కోతులకు తినేందుకు ఏమి దొరక పొవడంతో అవి ఇళ్లలోకి, పట్టణాల మీద వచ్చిపడుతున్నాయి.ఈ కోవకు చెందిన ఒక వీడీయో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
బ్రెజిల్ లో జరిగిన ఈ వింత ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. అక్కడున్న కోతులకు బాగా ఆకలేసి నట్లుంది. అవి వెంటనే ఏదైన తినేందుకు దొరుకుతుందా.. అని వెతుకుతూ రోడ్ల మీదకు వచ్చాయి. అక్కడ ఒక డస్ట్ బిన్ దొరికింది. ఇంకేం.. కోతులు అక్కడకు వెళ్లాయి. అక్కడ చెత్తకుప్పలో వెతికాయి. అక్కడ వాటిని తినేందుకు ఏది దొరకలేదు కానీ.. ఒక లిక్కర్ బాటిల్ మాత్రం దొరికింది.. తొలుత దాన్ని వింతగా చూశాయి.
మరీ దానిలో కొంచెం లిక్కర్ కూడా అలానే ఉన్నట్లు తెలుస్తొంది. దానిలో..తన దాహాన్ని ఎలాగైన తీర్చేసుకొవాలనుకుంది. అప్పుడు ఆ కోతి.. బాటిల్ తీసుకుని తాగింది. అచ్చం మనుషుల మాదిరిగానే.. లిక్కర్ బాటిల్ ను పైకెత్తి ఆపకుండా తాగేసింది. రోడ్డుపైన వెళ్తున్న వారు కోతి చేష్టలు చూసి నవ్వుకున్నారు.
Read more: Viral Video: నువ్వు తోపు భయ్యా.. నోటీతో పాముకు సీపీఆర్.. వీడియో చూస్తే జడుసుకుంటారు..
అంతేకాకుండా.. కోతిలిక్కర్ తాగుతుండటంతో దాన్ని తమ ఫోన్ లలో వీడియో తీశారు. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ కు గురౌతున్నారు. ఇదేక్కడి విడ్డూరమంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు లిక్కర్ కు బానిసైన కోతి అంటూ ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.