Tulam Gold Netizen: తెలంగాణలో సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారిపై కేసులు నమోదు.. అరెస్ట్‌లు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలే కాకుండా సాధారణ ప్రజలు ప్రశ్నించినా కూడా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో అరెస్ట్ జరిగింది. అయితే ఇది ఫైర్ బ్రాండ్ కొండా సురేఖకు సంబంధించిన కేసు. సామాజిక మాధ్యమంలో 'తులం బంగారం ఏమైంది' అని ప్రశ్నించిన నెటిజన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతడిపై ఫిర్యాదు చేసింది ఎవరో కాదు మెదక్ ఎంపీ రఘునందన్ రావు కావడం గమనార్హం. ఈ ట్రయాంగిల్ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Konda Surekha: మళ్లీ రెచ్చిపోయిన కొండా సురేఖ.. పోలీస్ స్టేషన్లో రచ్చరచ్చ
ఏం జరిగింది?
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గత నెల 26వ తేదీన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ ఒక్క కార్యక్రమం తెలంగాణలో సంచలన పరిణామాలకు దారి తీసింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఇన్చార్జ్ మంత్రిగా కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరైన సురేఖకు రఘునందన్ రావు దండ వేయడం.. అనంతరం కేటీఆర్‌పై కొండా సురేఖ విరుచుకుపడడం.. తర్వాత సమంత, నాగచైతన్య విడాకుల ప్రస్తావన రావడం వంటి పరిణామాలు వేగంగా చోటుచేసుకున్నాయి.
Also Read: Revanth Reddy: దేశ రక్షణలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్
అయితే ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కొండా సురేఖ ఫొటోలకు రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అనుమల్ల మహేశ్ సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించారు. 'కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.లక్షతో పాటు తులం బంగారం ఏమైంది' అని ప్రశ్నించాడు. ఈ కామెంట్ చూసిన ఆమె ఎంపీ రఘునందన్ రావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ ఆరుగురు నెటిజన్లపై ఈ నెల 3వ తేదీన సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం బీఆర్ఎస్ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఎస్సై చంద్రశేఖర్, సిబ్బంది మొదట రాయికల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ సమాచారం ఇచ్చిన అనంతరం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు మహేశ్‌ను తరలించారు. ఎఫ్ఐఆర్లో మహేశ్‌తోపాటు మహమ్మద్ మొయిజుద్దీన్, దేవిశ్, ఎంఆర్, సౌత్ పా, జై తెలంగాణ పేరుతో ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్ పేర్లను చేర్చారు. కాగా ఈ అరెస్ట్‌లను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రశ్నిస్తే అరెస్ట్‌లా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రశ్నించడం ప్రజల హక్కు అని గుర్తు చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి