Free Mobile Yojana 2024: ఉచిత స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్ స్కీం పంపిణీ ప్రారంభించిన మోదీ ప్రభుత్వం.. ఇక్కడ దరఖాస్తు చేసుకోండి

Fact Check:  కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యువత కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త సర్కిలేట్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ పథకాన్ని ప్రవేశపెట్టింది.  

Written by - Bhoomi | Last Updated : Oct 15, 2024, 08:15 AM IST
Free Mobile Yojana 2024: ఉచిత స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్ స్కీం పంపిణీ ప్రారంభించిన మోదీ ప్రభుత్వం.. ఇక్కడ దరఖాస్తు చేసుకోండి

Fact Check: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యువత కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త సర్కిలేట్ అవుతోంది కేంద్ర ప్రభుత్వం విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్త పూర్తి కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ పీఐబీ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా నిరూపించింది. 

SarkariDNA పేరిట ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన ఈ వీడియో పూర్తిగా అవాస్తవమని పిఐబి కొట్టి పారేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అలాంటి పథకాలను ప్రవేశపెట్టలేదని, అందులో ఉన్న సమాచారం పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పింది. నిజానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో యువతకు పెద్దపీట వేశారు. ఇందులో ముద్ర యోజన రుణాలు, అలాగే ఉపాధి శిక్షణ కేంద్రాలు, పలు రకాల స్కాలర్ షిప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ టాబ్లెట్ ఉచితంగా అందజేస్తున్నారు అనే పథకం మాత్రం లేదని తేల్చి చెప్పారు.

నిజానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకం ప్రవేశపెట్టిన, అది పత్రిక ప్రకటన అందజేయడం, క్యాబినెట్ నిర్ణయం అనంతరం సమావేశం ఏర్పాటు చేసి తెలపడం చేస్తాయని అధికారులు చెబుతున్నారు. యువత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలను చూసి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఈ ఈ తప్పుడు ప్రకటనల్లో, కొన్నిసార్లు డైరెక్ట్ వెబ్ లింకులు పెట్టి, ఆయా లింకుల ద్వారా వివరాలు తెలియజేయాలని కోరుతుంటారు. 

ఒకవేళ పొరపాటున ఆ లింకులను క్లిక్ చేసి మీరు వివరాలు తెలియజేసినట్లయితే మీ వ్యక్తిగత సమాచారం డేటా  చౌర్యానికి గురవుతుందనే సంగతి గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లింకులపై క్లిక్ చేసి మీ సమాచారం తెలియజేయకూడదు. . ఒకవేళ తెలియజేశారా అంతే సంగతులు. కొన్ని సందర్భాల్లో మీ బ్యాంకు అకౌంట్లను సైతం హ్యాక్ చేసే ప్రమాదం ఉంటుంది. 

Also Read: India Vs Canada: భారత్‌ విడిచి వెళ్లిపోండి.. కెనడా దౌత్యవేత్తలపై కేంద్రం వేటు..!  

వీటితోపాటు ఇటీవల మరికొన్ని ప్రకటనల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వాషింగ్ మిషన్లు, మహిళలకు స్కూటీలు అందజేస్తుందని వార్తలు కూడా వస్తున్నాయి. వీటిపై కూడా పీఐబి వివరణ ఇస్తూ ఇవన్నీ కూడా అవాస్తవమైన ప్రచారమని కొట్టి పారేసింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రచారం చేసే వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానల్ లపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. 

అయితే ప్రజలు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలని, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకం ప్రకటించినా... స్వయంగా పత్రికా ప్రకటనల ద్వారా కానీ టీవీ ప్రకటనలు ద్వారా కానీ తెలియజేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తెలుసుకునేందుకు మీ జిల్లా కలెక్టరేట్ వద్ద పూర్తి సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు.

Also Read: Tirumala: తిరుమలలో కుండపోత..  ఆ  రోజున వీఐపీ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.. డిటెయిల్స్..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News